Advertisement
Google Ads BL

Bigg Boss 7: హౌస్‌లోకి అడుగుపెట్టింది వీరే..


సమయం: ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల 15 నిమిషాల మధ్యలో

Advertisement
CJ Advs

హౌస్‌లోకి 9వ కంటెస్టెంట్‌గా టేస్టీ సత్య, 10వ కంటెస్టెంట్‌గా రతిక రోజ్, 11వ కంటెస్టెంట్‌గా గౌతమ్ కృష్ణ, 12వ కంటెస్టెంట్‌గా హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఎంటర్ అయ్యారు. మధ్యలో విజయ్ దేవరకొండతో కాసేపు ఖుషి ప్రమోషన్స్ నిర్వహించారు. 13వ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్‌కు నాగార్జున ఒక మిర్చీ మొక్క ఇచ్చి పంపించారు. ఆ మొక్క పెరిగి.. మిర్చీ కాస్తే గిఫ్ట్స్ ఇస్తానని, అలా జరగకపోతే పనిష్మెంట్ ఇస్తానని తెలిపారు. ఇప్పుడు 14వ కంటెస్టెంట్ పెర్ఫామ్ చేస్తున్నారు. 14వ కంటెస్టెంట్‌గా జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమరదీప్ హౌస్‌లోకి అడుగుపెడుతున్నారు. అనంతరం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ నవీన్‌తో సినిమా ప్రమోషన్‌కి సంబంధించిన సంభాషణ జరుగుతోంది. అయితే 15వ కంటెస్టెంటా? లేక మూవీ ప్రమోషన్స్ కోసమేనా? అనేది నవీన్ విషయంలో ట్విస్ట్‌గా వదిలేశారు నాగార్జున. మొత్తంగా అయితే 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. హౌస్‌ని నాగార్జున లాక్ చేశారు. 

సమయం: ఆదివారం రాత్రి 8 గంటల 50 నిమిషాలు

కంటెస్టెంట్ నెం 8ని నాగార్జున పిలిచారు. ఆమె ఫెర్ఫామ్ చేస్తోంది. కార్తీకదీపం సీరియల్ విలన్ మౌనితగా చేసిన శోభా శెట్టి 8వ కంటెస్టెంట్. పెర్ఫామ్ అనంతరం నాగార్జునతో మంచి సంభాషణ నడుస్తోంది. ఫిట్‌నెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. నాగ్ ఆమెతో ఓ చిన్న గేమ్ ఆడుతున్నారు. హౌస్‌లో ఎవరైనా నువ్వు బ్యూటీఫుల్ అని కాంప్లిమెంట్ ఇస్తే.. పనిష్మెంట్ అంటూ నాగ్ ఆట పట్టించారు. అనంతరం హౌస్‌లోకి అడుగుపెట్టిన శోభా.. ఆశ్చర్యపోతోంది. ఆల్రెడీ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో పరిచయాలు జరుగుతున్నాయి.

సమయం: ఆదివారం రాత్రి 8 గంటల 40 నిమిషాలు

7వ కంటెస్టెంట్ వారసుడు సినిమాలోని పాటకు పెర్ఫామ్ చేస్తున్నారు. 7వ కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్, డ్యాన్సర్, యాక్టర్ ఆట సందీప్. పెర్ఫార్మెన్స్ అనంతరం నాగ్, సందీప్‌ల మధ్య సంభాషణ నడుస్తోంది. నాగ్ ఆట పట్టిస్తున్నారు. సందీప్‌ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ సందీప్‌ని పరిచయం చేసుకుంటున్నారు.

సమయం: ఆదివారం రాత్రి 8 గంటల 35 నిమిషాలు

హౌస్‌లోకి 6వ కంటెస్టెంట్‌గా షకీలా పరిచయం అవుతున్నారు. ఆమెకు సంబంధించిన ఏవీని ప్రదర్శిస్తున్నారు. ఆ ఏవీలో షకీలా తన కష్టాలను చెప్పుకుంటోంది. అనంతరం షకీలాను స్టేజ్ మీదకు ఆహ్వానించారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి తను ఎందుకు రావాలనుకుందో షకీలా చెబుతోంది. తెలుగు పీపుల్‌తో మంచి బాండింగ్ కోసం ఈ హౌస్‌లోకి అడుగుపెడుతున్నట్లుగా చెబుతున్నారు. షకీలా బాగోగులు చూసుకునే వారిని ఇద్దరిని పిలిచి.. షకీలా గొప్పతనాన్ని చెబుతున్నారు. షకీలా ఏడుస్తోంది. నాగ్, షకీలా మధ్య ట్రాన్స్‌జెండర్స్‌కు సంబంధించిన సంభాషణ నడుస్తోంది. అనంతరం షకీలాను నాగ్ హౌస్‌లోకి పంపించారు. హౌస్‌లోని వారితో పరిచయాలు జరుగుతున్నాయి. నాగార్జున 7వ కంటెస్టెంట్‌ని పిలుస్తున్నారు.

సమయం: ఆదివారం రాత్రి 8 గంటల 20 నిమిషాలు

హౌస్‌లో ఉన్న 5గురు కంటెస్టెంట్స్‌కి నాగ్ ఆఫర్ ఇచ్చారు. సూట్ కేస్‌లో ఉన్న అమౌంట్‌ని పెంచుతూ.. 5గురుకి ఆఫర్ ఇస్తున్నారు. రూ. 30 లక్షలు ఉన్నాయని చెప్పినా.. ఎవరూ తీసుకోవడానికి ముందుకు రాలేదు. సీజన్ 7 కాబట్టి.. 5 కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి.. టోటల్ రూ. 35 లక్షలు సూట్‌కేస్‌లో ఉన్నట్లుగా చెప్పినా.. అందరూ నో చెప్పేశారు. అనంతరం 3 సెకన్లు టైమ్ ఇచ్చి.. ఆ సూట్ కేస్‌ని ఎవరైతే రూమ్‌లో పెడతారో వాళ్లకి నాగ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. 5గురు కంటెస్టెంట్ మధ్య పోటాపోటీ జరుగుతుంది. టైమ్ అయిపోయింది. స్టోర్ రూమ్‌లోకి ఆ సూట్ కేస్‌ని పంపించారు. 6వ కంటెస్టెంట్ ఆగమనం. 

సమయం: ఆదివారం రాత్రి 8 గంటల 10 నిమిషాలు

5వ కంటెస్టెంట్‌ని నాగార్జున పిలిచారు. ఆమె పెర్ఫార్మెన్స్ ఇస్తోంది. రూల్స్ రంజన్ సినిమాలోని సమ్మోహనుడా పాటకి ఆమె పెర్ఫార్మ్ చేస్తోంది. 5వ కంటెస్టెంట్ లాయర్, యాక్టర్ శుభశ్రీ రాయగురు. పెర్ఫార్మెన్స్ అనంతరం నాగ్‌తో ఆమె సంభాషణ జరుగుతోంది. హౌస్‌లోకి శుభశ్రీ అడుగుపెట్టారు. పరిచయాలు జరుగుతున్నాయి. ఈ ఐదుగురుతో కింగ్ నాగార్జున ఓ గేమ్‌ని స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ప్రియాంక దాచిన సూట్‌కేస్‌ని తీసుకువచ్చి 5గురు మధ్య పోటీ పెట్టారు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. మొదటి 5గురుకి టాస్క్ పెట్టారు. నార్మల్‌గా ప్రతి సీజన్‌లో టాప్ 5లో ఉన్న వారికి సూట్‌కేస్ ఇచ్చినట్లుగా.. ఇప్పుడు ఎంటరైన వారి మధ్య అలాంటి క్యాష్‌తో ఉన్న సూట్‌కేస్‌తో నాగ్ గేమ్ ఆడుతున్నారు. ఆ సూట్‌కేస్‌లో ఉన్న క్యాష్ తీసుకుని ఇప్పుడే వెళ్లిపోవచ్చని నాగ్ చెబుతున్నారు. 

సమయం: ఆదివారం రాత్రి 8 గంటలు

ప్రిన్స్ యావర్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. శివాజీ తనదైన తరహాలో యావర్‌పై కామెడీ చేస్తున్నారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ పరిచయం చేసుకుంటున్నారు.

సమయం: ఆదివారం రాత్రి 7 గంటల 50 నిమిషాలు

మూడో కంటెస్టెంట్ హౌస్‌లోకి అడుగుపెట్టి.. హౌస్‌లోని వారితో సంభాషిస్తుండగానే.. నాగార్జున నాలుగో కంటెస్టెంట్‌ని ఆహ్వానించారు. మోడల్, యాక్టర్ అయిన ప్రిన్స్ యావర్ అనే అతను సాహో సినిమాలోని బాడ్ బాయ్ పాటకి ఫెర్ఫామ్ చేస్తున్నారు. అనంతరం ప్రిన్స్ యావర్‌, నాగ్‌ల మధ్య సంభాషణ నడుస్తోంది. 

సమయం: ఆదివారం రాత్రి 7 గంటల 45 నిమిషాలు

మూడో కంటెస్టెంట్‌గా సింగర్ దామిని ఎంట్రీ ఇచ్చారు. బ్లాస్ట్ బేబీ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన సింగర్ దామినీతో నాగ్ ఓ పాట పాడించుకుంటున్నారు. ధమ్ ధమ్ ధమ్ అంటూ ఇటీవల నేషనల్ అవార్డు పొందిన పాటని ఆమె ఆలపించారు. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. దామిని తన సేవా కార్యక్రమాల గురించి చెబుతుంది. నాగ్ కోసం చేసిన గిఫ్ట్‌ని దామిని ప్రజంట్ చేసింది. 

సమయం: ఆదివారం రాత్రి 7 గంటల 40 నిమిషాలు

నాగార్జున, శివాజీల మధ్య సంభాషణ జరుగుతుంది. ఎందుకు బిగ్‌బాస్‌కి వచ్చాడో శివాజీ చెబుతున్నారు. శివాజీ లైఫ్‌లో ఉల్టా పుల్టా సంఘటనలు చెబుతున్నారు. నాగార్జున అందం గురించి శివాజీ పొగుడుతున్నారు. బయట పాలిటిక్స్ చూశావ్.. ఇప్పుడు హౌస్‌లో ఓ రేంజ్‌లో పాలిటిక్స్ ఉంటాయని నాగ్ అంటున్నారు. పవరాస్త్ర, కంటెస్టెంట్, హౌస్‌మేట్ గురించి నాగ్ చెబుతున్నారు. శివాజీకి చెందిన ఓ వీడియోని నాగార్జున మన టీవీలో చూపిస్తున్నారు. శివాజీ.. వాళ్ల అమ్మ ఝాన్సీ లక్ష్మీని గుర్తు చేసుకుంటున్నారు. అనంతరం శివాజీని హౌస్‌లోకి పంపించారు నాగ్. శివాజీ హౌస్‌లోకి వెళ్లగానే ప్రియాంక పరిచయం. శివాజీకి వెల్‌కమ్ చెబుతుంది. ఇద్దరి మధ్య కొంత సంభాషణ నడుస్తుంది. మూడో కంటెస్టెంట్ ఆగమనం. 

సమయం: ఆదివారం రాత్రి 7 గంటల 30 నిమిషాలు

ప్రియాంక ఆ సూట్ కేస్‌ను జైలు దగ్గర ఉన్న వాష్‌రూమ్‌లో దాచిపెట్టింది. ఇది ఒకరకంగా ప్రియాంకకు ఒక టాస్క్ అనే చెప్పాలి. ఇప్పుడు కింగ్ నాగార్జున రెండో కంటెస్టెంట్‌ని పిలుస్తున్నారు. హాలోగ్రామ్ దర్శిని అంటూ కింగ్ కనబడే తీరు చెబుతున్నారు. రెండో కంటెస్టెంట్ ఆగమనం. హీరో శివాజీ రెండో కంటెస్టెంట్‌గా పరిచయం అవుతున్నారు. 

సమయం: ఆదివారం రాత్రి 7 గంటల 20 నిమిషాలు

ఫస్ట్ కంటెస్టెంట్ ప్రియాంకను హౌస్‌లోకి పంపిన అనంతరం.. హౌస్‌లోని రూమ్స్‌ని, ఫర్నీచర్‌ని ప్రేక్షకులకి చూపించారు. అన్నీ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. విఐపీ బెడ్‌రూమ్, డీలక్స్ బెడ్ రూమ్, స్టాండర్ట్ బెడ్ రూమ్ అంటూ మూడు రూమ్స్‌ని పరిచయం చేశారు. ప్రియాంకని కూడా హౌస్ మొత్తం చెక్ చేయమని చెప్పారు. తర్వాత ప్రియాంకను ఓ యాక్టివిటీ రూమ్‌కి రమ్మని పిలిచారు. అక్కడ ఓ సూట్‌కేస్ కనిపిస్తుంది. ఎలిమినేట్ అయ్యే సమయంలో వచ్చే సూట్ కేస్ కావడంతో ప్రియాంక షాకయింది. అయితే ఆ సూట్ కేస్‌ని ఎవరికీ కనబడకుండా దాచిపెట్టమని ప్రియాంకకు నాగ్ చెప్పారు. అందులో ఓ పవర్ ఉన్నట్లుగా నాగ్ తెలిపారు. అందులోనూ మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు నాగ్.

సమయం: ఆదివారం రాత్రి 7గంటల 10 నిమిషాలు

బిగ్‌బాస్ సీజన్ 7 ఫస్ట్ కంటెస్టెంట్‌ని కింగ్ నాగార్జున స్టేజ్‌పైకి ఆహ్వానించారు. జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ ప్రియాంక ఫస్ట్ కంటెస్టెంట్‌‌గా స్టేజ్‌పైకి ‘బలగం’ సినిమాలో పొట్టిపిల్ల పాటతో ఎంట్రీ ఇచ్చారు. పాట అనంతరం ప్రియాంకకు కంటెస్టెంట్ మాత్రమే అని చెబుతూ.. హౌస్‌లోకి ఆమెని పంపించారు. హౌస్‌లోకి వెళ్లిన ప్రియాంక సర్‌ప్రైజ్ అయింది. ఎందుకంటే.. ఎటువంటి ఫర్నిచర్ హౌస్‌లో లేదు. అవన్నీ సంపాదించుకోవాలని నాగార్జున చెప్పారు.

సమయం: ఆదివారం రాత్రి 7 గంటలు

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 6 సీజన్స్ పూర్తి చేసుకుని 7వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. కింగ్ నాగార్జున ల్యాగ్ లేకుండా సీజన్ 7ని స్టార్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాలోని థార్ మార్ థక్కర్ మార్ పాటతో నాగ్ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఆయన బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఉల్టా పుల్టా సీజన్ అని, పవరాస్త్ర అంటూ ఈసారి కంటెస్టెంట్స్ వేరు, హౌస్‌మేట్స్ వేరు అంటూ పెద్ద ట్విస్టే ఇచ్చారు. ఇంత వరకు మీరు చూసిన ఆట వేరు. ఇక చూడబోయేది వేరు. ఊహకు అందని సీజన్ అంటూ.. పవరాస్త్రను పరిచయం చేసి.. ఫస్ట్ కంటెస్టెంట్‌ను పరిచయం చేశారు.  

Bigg Boss Telugu Season 7 Live Updates:

Bigg Boss Telugu Season 7 Full List
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs