Advertisement
Google Ads BL

‘OG’లో ‘భీమ్లా నాయక్’


హంగ్రీ చీతా అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం ఓజీ సినిమా నుంచి గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి ఫ్యాన్స్ ఏమైతే కోరుకుంటున్నారో.. అది ఈ సినిమాలో ఉండబోతుందనేలా.. ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్ ఇచ్చేసిందీ గ్లింప్స్. అయితే ఈ గ్లింప్స్‌లో భీమ్లా నాయక్ కూడా కనిపించడంతో ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. అదెలా అంటే.. 

Advertisement
CJ Advs

ఈ గ్లింప్స్ నటుడు అర్జున్ దాస్ వాయిస్‌ ఓవర్‌తో పవన్ కళ్యాణ్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ప్రారంభమైన తీరుగానీ.. ‘పదేళ్ల క్రితం బొంబాయిలో వచ్చిన తుఫాను గుర్తుందా? అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరిని ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. అదొక భయంకరమైన బ్లెడ్ బాత్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడూ అంటే.. అతను సైతాను అవుతాడు’ అంటూ.. పవన్ కళ్యాణ్‌ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం అంతా.. ఓ రేంజ్‌లో ఉంది. మరీ ముఖ్యంగా థమన్ మ్యూజిక్‌ ఫుల్ డామినేట్ చేసిందనే చెప్పాలి. సరే అవన్నీ పక్కన పెడితే.. గ్లింప్స్ చివరిలో పవన్ కళ్యాణ్ సీరియస్‌గా ఓ డైలాగ్ చెబుతాడు. 

ఆ డైలాగ్‌తో గ్లింప్స్‌ని ఫినిష్ చేస్తే.. పర్ఫెక్ట్‌గా ఉండేది. ఆ డైలాగ్ తర్వాత పోలీస్ స్టేషన్‌లో పవన్ కళ్యాణ్ చేసే చేష్టలన్నీ.. మళ్లీ ‘భీమ్లా నాయక్’ని తలపించాయి. అక్కడి వరకు ఓ.. అనే రేంజ్‌లో వీక్షించిన ఫ్యాన్స్‌కి సైతం.. ఆ సీన్ నచ్చలేదంటే.. దర్శకుడు సుజిత్ ఒక్కసారి చూసుకోవాల్సి ఉంటుంది. కేవలం గ్లింప్సే కాబట్టి.. లైట్ తీసుకున్నా.. ‘భీమ్లా నాయక్’లో డానీతో గొడవ పడే సీన్ రిపీట్ అయినట్లుగా అయితే అనిపిస్తుంది. ఫ్యాన్స్ కూడా చాలా మంది ఈ విషయాన్ని నోటీస్ చేసి.. ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తున్నారు. యూనిట్ ఒక్కసారి దీనిపై దృష్టి పెడితే బాగుంటుంది. 

Bheemla Nayak in OG Movie:

Fans Disappointed with OG Glimpse Last Shot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs