Advertisement
Google Ads BL

మిస్ శెట్టిలో గ్రేట్ క్వాలిటీ ఏంటంటే..


లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో అనుష్క చెఫ్‌గా నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ను నవీన్ పొలిశెట్టి ఒంటి చేత్తో చేస్తున్నాడు. అనుష్క కూడా ప్రమోషన్స్‌కు వస్తుందని అంతా ఊహించారు కానీ.. ఇంత వరకు ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలో తప్పితే.. ఈ సినిమా గురించి అనుష్క మాట్లాడేందుకు మీడియా ముందుకు రావడం లేదు. ఈ 

Advertisement
CJ Advs

సినిమాకు ప్రీ రిలీజ్ వేడుక కూడా ఉండదని అంటున్నారు. అందుకే నవీన్ పొలిశెట్టి ఈ సినిమా కోసం బీభత్సంగా కష్టపడుతున్నాడు. 

ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మిస్ శెట్టి గురించి, ఆమెలోని ఓ గ్రేట్ క్వాలిటీని గురించి ఈ మిస్టర్ పొలిశెట్టి చెప్పుకొచ్చాడు. అదేంటంటే.. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఫస్ట్ అనుష్కను చూడగానే నవీన్ భయపడ్డాడట. అయితే అనుష్క సెట్‌లోకి అడుగుపెట్టగానే అందరికీ ఓ వామ్ హగ్ ఇస్తుందట. ఆ హగ్ తర్వాత తనకి భయం పోయిందని.. అనుష్కలోని ఈ గొప్ప క్వాలిటీకి తను ఫిదా అయ్యానని, తను కూడా ఇప్పుడు అందరికీ అలా హగ్ ఇవ్వడం నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడీ మిస్టర్ పొలిశెట్టి.

ఇంకా అనుష్క గురించి చెబుతూ.. అనుష్కతో కాంబినేషన్ సీన్స్ చేసేటప్పుడు.. ఆమెను చూస్తూ.. చెప్పాల్సిన డైలాగ్స్ కూడా మరిచిపోయేవాడట. మళ్లీ తేరుకుని.. ఎలాగోలా సీన్ పూర్తి చేసేవాడినని చెప్పుకొచ్చాడు. స్వీటీ కదా.. ఆ మాత్రం ఉంటదిలే. దూరం నుంచి చూసేవారే స్వీటీకి పడిపోతారు.. అలాంటిది ఎదురెదురుగా ఉంటే.. నీకు ఆ మాత్రం జరగడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. అనుష్క ఫ్యాన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Naveen Polishetty About Great Quality in Anushka Shetty:

Naveen Polishetty Revealed Anushka Shetty Secret
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs