Advertisement
Google Ads BL

బిగ్‌బాస్ లోకి ఆ హీరో ఎంట్రీ


బిగ్ బాస్ 7 పై బాగా హైప్ పెంచేశారు. గత మూడు సీజన్స్ నుండి బిగ్ బాస్ లీకులు ఇబ్బంది పెట్టడంతో ఆ సీజన్స్ పై క్రేజ్ తగ్గిపోయింది. కారణం లీకులే. అందుకే ఈ సీజన్‌కి ఎలాంటి లీకులు లేకుండా.. అసలు హౌస్‌లోకి ఎవరెవరు వెళ్ళబోతున్నారో కూడా బయటికి రాకుండా యాజమాన్యం చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఈరోజు (శనివారం) బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ షూట్ మొదలైపోయింది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ సీజన్ 7 రేపు ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి కంటెస్టెంట్స్ పరిచయంతో పాటుగా స్పెషల్ డాన్స్‌లు వంటి వాటిని షూట్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

అయితే ఈ సీజన్‌లోకి ఎవరెవరు వెళుతున్నారనే విషయంలో కొన్ని పేర్లు వినిపించినా చివరికి వారు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళతారో.. లేదో.. కానీ.. ఫైనల్ లిస్ట్ లో మరికొంతమంది యాడ్ అయ్యారనే టాక్ వినిపిస్తుంది. అందులో ముఖ్యంగా సీనియర్ హీరో శివాజీ ఈ సీజన్‌లో హౌస్‌లోకి వెళ్ళబోతున్నట్లుగా టాక్ అయితే బీభత్సంగా వినిపిస్తుంది.

కొన్నాళ్లుగా నటనకు దూరంగా రాజకీయాలకి దగ్గరగా ఉంటున్న శివాజీ.. ఈమధ్యన యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వూస్‌లో కనిపించాడు. సినిమాలకి-రాజకీయాలకి దూరంగా ఉంటున్న శివాజీ క్రేజ్‌ని బట్టి ఆయనకి భారీగా పారితోషకం ఇచ్చి మరీ ఈ సీజన్ లోకి ఎంట్రీ ఇప్పిస్తున్నారని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ సీజన్ హౌస్‌లోకి ఎవరెవరు వెళుతున్నారో అనేది ఈరోజు నైట్‌కి కానీ, రేపు ఉదయానికి కానీ లిస్ట్ బయటికొచ్చే ఛాన్స్ వుంది అని.. ఈ లీకు ఆపగలిగితే ఈ సీజన్ హిట్ గ్యారెంటీ అంటున్నారు.

Bigg Boss Telugu Season 7 Latest Updates:

Hero Sivaji to Enter Bigg Boss Telugu season 7
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs