నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. జనసేనానికి బర్త్ డే కి సినీ, రాజకీయ ప్రముఖులు అంతా చెప్పే బర్త్ డే విషెస్ ట్వీట్స్ తో సోషల్ మీడియా వేదికగా అంతా హడావిడిగా ఉంది. నారా చంద్రబబు దగ్గర నుండి సూపర్ స్టార్ మహెష్ వరకు పవన్ కి బర్త్ డే గ్రీటింగ్స్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ప్రేమతో విషెస్ చెప్పడమే కాదు.. తన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్న పిక్ ని షేర్ చేసారు. పవన్ ని విష్ చేస్తూ..
Dearest Kalyan Babu ,
జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో,
నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ,
ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ,
నీకు జన్మదిన శుభాకాంక్షలు! 💐💐💐 Happy Birthday Dearest brother @PawanKalyan
! 💐💐 May you have a wonderful year ahead ! అంటూ చిరు ప్రేమతో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.