Advertisement
Google Ads BL

బండ్లన్న విషెస్ వచ్చేశాయ్..


ఎవరు ఎన్ని రకాలుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినా.. పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఆయన భక్తుడైన బండ్లన్న విశెష్ గురించే ఆలోచిస్తుంటారు. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ ఓ స్టేజ్‌పై పవన్ కళ్యాణ్‌పై బండ్ల చాటిన అభిమానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ మధ్య పవర్‌స్టార్ ఫంక్షన్స్‌కి బండ్ల గణేష్ రావడం లేదు కానీ.. వచ్చి ఉంటేనా.. ఫ్యాన్స్ చెప్పుకోవడానికి ఇంకా ఎన్నో పదాలు పుట్టుకొచ్చేవి. అసలు పవర్ స్టార్ గురించి మాట్లాడటం మొదలు పెడితే.. బండ్ల గణేష్‌ని ఆపడం ఎవరి తరం కాదు. అలా ఉంటుంది ఆయన వాక్చాతుర్యం.

Advertisement
CJ Advs

ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు‌ను పురస్కరించుకుని బండ్ల గణేష్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు. మీరు అనుకున్నది సాధిస్తారు.. మీరేంటో నాకు తెలుసు.. విజయిభవ అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బండ్ల ట్వీట్‌కు, తెలియజేసిన శుభాకాంక్షలకు ఫ్యాన్స్ కూడా పొంగిపోతున్నారు. వీలైతే ఒక సినిమా ప్లాన్ చేయ్ అన్నా.. బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

నా జీవితానికి వెలుగునిచ్చిన దాత ప్రదాత, నా దైవం. జననేత జనసేన అధినేత మీరు సంకల్పించిన మీ సంకల్పం చాలా గొప్పది. మీరు అనుకున్నది సాధిస్తారు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా, మీ పట్టుదల మీ కృషి మీ కసి దగ్గరనుంచి చూసిన మీ భక్తున్ని మాకు మీరేంటో నాకు తెలుసు మీ మనసు ఏంటో నాకు తెలుసు విజయిభవ మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్.. అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు బండ్ల గణేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

Bandla Ganesh Birthday Greetings to Power Star :

Bandla Ganesh Tweet on Pawan Kalyan goes Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs