Advertisement
Google Ads BL

సలార్ మేకర్స్ పై ఓవర్సీస్ ఆడియన్స్ ఫైర్


సలార్ పోస్ట్ పోన్ న్యూస్ చూసి ప్రభాస్ ఫాన్స్ ఎలా ఫీలయ్యారో తెలియదు కానీ.. ఓవర్సీస్ ఆడియన్స్ మాత్రం విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు. నిన్న శుక్రవారం సలార్ పోస్ట్ పోన్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం.. ఈ విషయమై మేకర్స్ కామ్ గా ఉండడంతో ప్రభాస్ ఫాన్స్ కి ఆందోళన కలిగించింది. కానీ ఓవర్సీస్ ఆడియన్స్ మాత్రం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పోస్ట్ పోన్ చేసేకాడికి.. బుకింగ్స్ ఓపెన్ చెయ్యడమెందుకు అంటూ వారు ఫైర్ అవుతున్నారు. 

Advertisement
CJ Advs

సలార్ రైట్స్ కొన్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ గొప్పగా సలార్ అడ్వాన్స్ బుకింగ్ ని ఎప్పుడో ఓపెన్ చేసారు. సలార్ ట్రైలర్ విడుదల కాకపోయినా.. టీజర్ తోనే సినిమాపై క్రియేట్ అయిన హైప్ తో మూవీ లవర్స్ సలార్ టికెట్స్ కొనేందుకు ఎగబడ్డారు. వచ్చేవారం విడుదల కాబోతున్న జవాన్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోతుంటే.. నెల తర్వాత విడుదల కావల్సిన సలార్ దానికి తలతన్నే రేంజ్ లో టికెట్స్ తెగడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ గా ఉన్నారు. 

సలార్ పోస్ట్ పోన్ అని వార్తలొచ్చినా మేకర్స్ ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వకపోయినా ఓవర్సీస్ లో మాత్రం సలార్ కథ వేరేలా ఉంది.  టికెట్ బుకింగ్స్ వెబ్ సైట్స్ నుండి సలార్ మూవీని తొలగించారు. మరోపక్క టికెట్స్ కొన్నవారికి డబ్బులు రీ ఫండ్ చేస్తున్నారు అడ్వాన్స్ బుకింగ్ లో 19000 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. దాంతో సలార్ ఓవర్సీస్ ఓపెనింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చెయ్యడం ఖాయమని అభిమానులు హ్యాపీ గా ఫీలవుతున్న వేళ ఇలా సలార్ పోస్ట్ పోన్ ఫాన్స్ కి బాధనిపించినా టికెట్స్ కొన్న ఓవర్సీస్ ఆడియన్స్ కి మండేలా చేసింది. 

Overseas audience fire on Salaar Makers:

Prabhas Salaar postponed!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs