Advertisement
Google Ads BL

OG: హైప్‌తో సచ్చిపోయేలా ఉన్నారు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజంట్ మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి హరిహర వీరమల్లు కాగా, రెండోది ఉస్తాద్ భగత్ సింగ్. ఈ రెండు సినిమాలు షూటింగ్ కాస్త స్లోగా నడుస్తున్నాయ్. ఇక మూడోది OG. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయంటే.. తెలుగు చలనచిత్ర పరిశ్రమది ఇప్పటి వరకు ఒక లెక్క.. OG తర్వాత మరో లెక్క అన్నట్లుగా.. మేకర్స్ హైప్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇంత వరకు ఏ నిర్మాత కూడా తను నిర్మించే సినిమా విషయంలో ఇలా హైప్ ఎక్కించి ఉండరు.. ఉన్న దాఖలాలు కూడా లేవు.

Advertisement
CJ Advs

ఫ్యాన్స్ ఎప్పుడు అడిగితే అప్పుడు అప్‌డేట్ ఇస్తూ.. ఫ్యాన్స్ అడిగారని బిర్యానీలు పంపిస్తూ.. ఫ్యాన్స్ చెప్పిన డేట్, టైమ్‌కి టీజర్ వదులుతూ.. ఇలా మాములుగా హైప్ క్రియేట్ చేయడం లేదు. ఇంత వరకు పవన్ కళ్యాణ్‌తో ఎంతో మంది నిర్మాతలు సినిమాలు చేశారు. కానీ డివీవీ దానయ్యకు మాత్రం మెగాభిమానులు గుడి కట్టేయడానికి కూడా సిద్ధమవుతున్నారంటే.. OGపై నిర్మాత ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో, ఎలా హైప్ పెంచుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఫ్యాన్స్ అయితే.. ఈ హైప్‌తో సచ్చిపోతే.. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అంటూ ప్రశ్నిస్తున్నారంటే.. ఫ్యాన్స్‌‌కి ఏ రేంజ్‌లో OGని ఎక్కించారో ఊహించుకోవచ్చు.

ఆర్ఆర్ఆర్ తర్వాత డివీవీ దానయ్య చేస్తున్న సినిమా OG. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఫ్యాన్స్ కూడా అడగకుండానే.. అదిరిపోయేలా అప్‌డేట్స్ ఇస్తూ.. పవన్ కళ్యాణ్ షూటింగ్‌‌లో ఉంటే చాలు.. ఆయన పిక్స్‌ని షేర్ చేస్తూ.. దాదాపు సోషల్ మీడియా అంతా పండగ వాతావరణం క్రియేట్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అనౌన్స్‌మెంట్ ఓ రేంజ్‌లో ఉండటంతో.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా? అని ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి కాసేపట్లో.. సోషల్ మీడియాని ఆక్రమించేందుకు OG వచ్చేస్తుండటంతో డీవీవీ బ్యానర్‌ని అస్సలు పట్టుకోలేకపోతున్నారు..

Fans Happy with DVV Entertainments Updates on OG:

OG Teaser Updates Creates Sensation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs