Advertisement
Google Ads BL

హరిహర వీరమల్లు ట్రీట్ వచ్చేసింది


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫ్యాన్స్‌కి ట్రీట్స్ మొదలయ్యాయి. అర్థరాత్రి 12 గంటల తర్వాత పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. అయితే ఇందులో కొత్తగా ఏం పవన్ కళ్యాణ్ కనిపించలేదు కానీ.. అసలీ సినిమా నుంచి అప్‌డేట్ రావడమే.. ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇస్తుంది. కారణం.. ఈ సినిమాపై వినిపిస్తున్న వార్తలే. 

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీ కావడంతో.. హరిహర వీరమల్లుని పక్కన పెట్టేశారని ఈ మధ్య కొందరు వార్తలు వైరల్ చేస్తున్నారు. ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ.. సినిమా లైన్‌లోనే ఉందనేలా పోస్టర్ వదలడమే కాకుండా.. అతి త్వరలోనే వీరమల్లు బ్యాలెన్స్ షూట్‌‌ని పవన్ కళ్యాణ్ పూర్తి చేయబోతున్నారనేలా టాక్ బయటికి రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఎందుకంటే.. ఈ ప్రాజెక్ట్ అలాంటిది. ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలు అలాంటివి. 

పవన్ కళ్యాణ్‌కి ఆయన ఫ్యాన్స్‌కి ఎంతో ఇష్టమైన నిర్మాత ఏ ఏం రత్నం ఈ సినిమా నిర్మిస్తుండటంతో.. వీరమల్లుపై మొదటి నుంచి ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా రికార్డులు తిరగరాయడం ఖాయం అనే ఆలోచనలో మెగాభిమానులు ఉన్నారు. షూటింగ్ సజావుగా నడవడం లేదు కానీ.. లేదంటే ఈ సరికే ఈ సినిమా థియేటర్లలోకి దిగిపోయేది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ బిజీని దృష్టిలో పెట్టుకుని.. అమరావతి పరిసర ప్రాంతాలలోనే ఈ సినిమాని చిత్రీకరణ జరిపేలా నిర్మాత ప్లాన్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈ పుట్టినరోజుకు ఫ్యాన్స్‌కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మొదటి ట్రీట్ మాత్రం ఈ పోస్టరే. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

Pawan Kalyan Birthday Special Treat From HariHara VeeraMallu Out:

HariHara VeeraMallu New Poster Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs