Advertisement
Google Ads BL

ఒక్క సినిమా.. ముగ్గురూ గట్టెక్కేసారు


ఒక్క సినిమాతో ముగ్గురు కమ్ బ్యాక్ అవ్వకపోతే కెరీర్ ముగిసిపోయినట్లే అన్నట్టుగా మాట్లాడిన వారు ఈరోజు ఆ సినిమా టాక్ చూసి నోరెళ్ళ బెట్టడమే కాదు.. ఒక్క సినిమాతో ముగ్గురు గట్టెక్కేశారని మాట్లాడుకుంటున్నారు. నిజమే కదా.. పడే వాళ్ళ మీద రాళ్లేయ్యడం అందరికి అలవాటే.. అదే బెటర్ పొజిషన్ లో కనబడగానే మెచ్చుకోవడమనేది మానవ నైజం. ఇప్పుడు ఇంత ఎందుకు మాట్లాడుతున్నాము అంటే.. ఖుషి సినిమా మొదలు పెట్టినప్పుడు విజయ్ దేవరకొండ లైగర్ ప్రమోషన్స్ లో ఉన్నాడు. 

Advertisement
CJ Advs

సమంత యశోద సక్సెస్ లో ఉంది. ఖుషి సినిమా మొదలయ్యాక సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ దేవరకొండతో సమంత పెయిర్ అనగానే అందరి చూపు దానిపై పడింది. శివ నిర్వాణతో విజయ్-సమంత జోడి కట్టారు. మధ్యలో సమంతకి అనారోగ్యం, విజయ్ దేవరకొండ కి లైగర్ షాక్ అన్ని కలిపి గత ఏడాది రిలీజ్ అవ్వాల్సిన ఖుషి ఫైనల్లీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివ నిర్వాణకి టక్ జగదీశ్ సో సో రిజల్ట్ ఇవ్వడం, విజయ్ కి లైగర్, సమంతకి శాకుంతలం డిజాస్టర్స్ ఉండడంతో వీరి ముగ్గురికి ఖుషి హిట్ కంపల్సరీ అయ్యింది. దానితో నెటిజెన్స్ కూడా అదే మాట్లాడారు. 

ఇక నేడు విడుదలైన ఖుషి మూవీకి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ కాదు.. ఎక్కడ చూసినా ఖుషి న్యూస్ లే కనబడుతున్నాయి. బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అందుతున్నాయి. విజయ్ ఐదేళ్లకి మంచి హిట్ కొట్టాడు, శాకుంతలం డిసాస్టర్ అయినా సమంతకి ఖుషి హిట్ వచ్చేసింది, శివ అయితే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఒక్క సినిమా ముగ్గురు గట్టెక్కేసారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Kushi Movie blockbuster reports:

Kushi movie super hit reviews
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs