Advertisement

కాంగ్రెస్‌ను ఖతం చేయడమే కేసీఆర్ లక్ష్యం


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల రేస్ నుంచి దాదాపు బీజేపీ తప్పుకున్నట్టే. దేశం విషయానికి వస్తే.. కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమికి దూరం పాటిస్తానని బీఆర్ఎస్ హామీ ఇచ్చిందట. దానికి ప్రత్యామ్నాయంగా ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి ఎమ్మెల్సీ కవితను తప్పించడం.. తెలంగాణలో తమ పార్టీని వీక్ చేసుకుంటామంటూ బీజేపీ హామీ ఇచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ బీజేపీ జోలికి వెళ్లడం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. 

Advertisement

బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.. కాంగ్రెస్ లోకి కోవర్టులను పంపామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కామెంట్స్ చేస్తుండగా.. కాంగ్రెస్ వాళ్లంతా కుక్కల్లా తమ దగ్గర పడుంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అంటున్నారు. ఇప్పుడు వీరిద్దరి వ్యాఖ్యలు తెలంగాణలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇటీవలి కాలంలో సక్సెస్ అవుతుండటం బీఆర్ఎస్‌ను భయపెడుతున్నాయి. కర్ణాటక వేవ్ తెలంగాణకు పాకిందంటే కష్టమని కేసీఆర్ టీం భయపడుతోందని సమాచారం. నిజానికి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్లాలి కానీ ఎందుకో అనుకున్నంత ఫాస్ట్‌గా అయితే లేదు.

కనీసం పార్టీలో చేరుతాం బాబోయ్ అంటున్న నేతలను సైతం పార్టీలోకి తీసుకునేందుకు కాంగ్రెస్ నేతలు తెగ ఆలోచిస్తున్నట్టు పరిస్థితులను బట్టి అర్ధమవుతోంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నేత వేముల వీరేశం.. కాంగ్రెస్ లోకి వచ్చేందుకు రెండు నెలల క్రితమే ఆసక్తిని కనబరచినా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారణంగా ఆయన్ను పార్టీలోకి తీసుకోవడం ఆలస్యమైందని టాక్. పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యక్తి ప్రయోజనాలు పరిగణలోకి తీసుకుంటోందని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ మాత్రం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని బీఆర్ఎస్ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గమే ఆయువు పట్టు. దానిని టార్గెట్ చేసిన కేసీఆర్ తన అభ్యర్థుల జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు. ఇక ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయితే ఓకే లేదంటే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.

KCR aim is to destroy the Congress:

KCR changing tack: Congress is now his main target
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement