Advertisement
Google Ads BL

పుష్ప 2: నార్త్ ఇండియా డీల్ లో ట్విస్ట్


ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న సినిమా పుష్ప 2. పుష్ప పార్ట్ 1 తోనే నేషనల్ అవార్డు విన్నర్ గా నిలిచిన అల్లు అర్జున్.. ఆ చిత్రంతో ఎలాంటి అంచనాలు లేకుండానే నార్త్ లో 100కోట్లు కొల్లగొట్టాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ బ్రాండ్ వాల్యూ హిందీలో విపరీతంగా పెరిగింది. బాలీవుడ్ లో మంచి పిఆర్ టీం తో తన క్రేజ్ పెంచుకుంటున్న అల్లు అర్జున్ కి ఇప్పుడు నేషనల్ స్థాయిలో ఉత్తమనటుడు అవార్డు రావడంతో ఆ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.

Advertisement
CJ Advs

పుష్ప కి నామమాత్రపు అంచనాలు, సిల్లీ ప్రమోషన్స్ తో ఆడియన్స్ ముందుకు రాగా.. ఆ చిత్రం విడుదలయ్యాక సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. దానితో పుష్ప 2 పై నార్త్ లో క్రేజ్, అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కైవసం చేసుకోవడంతో ఇప్పడు పుష్ప 2 నార్త్ రైట్స్ హాట్ డీల్ తో సేల్ అయినట్లుగా తెలుస్తుంది. 125 కోట్ల భారీ రేటుకి అక్కడి బడా నిర్మాణ సంస్థ పుష్ప 2 హక్కులని దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. పుష్ప2 నార్త్ డీల్ క్లోజ్ అవడం.. ఆ 125 కోట్లు ఇప్పుడు అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ కింద జమ చేసుకున్నాడంటున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 కి ఎలాంటి పారితోషకం తీసుకోకుండా ఇలా నార్త్ ఇండియా రైట్స్ ని మేకర్స్ నుండి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అలా అయితే అల్లు అర్జున్ పుష్ప 2 కి 125 కోట్ల పారితోషకం తీసుకున్నాడని విషయం తెరపైకి వచ్చింది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. 

Twist in Pushpa 2 North India Deal:

Pushpa 2 North Rights seems to be sold with a hot deal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs