Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్


అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలిచినప్పటినుండి ఇప్పటివరకు అల్లు ఫాన్స్ చాలా ఖుషీగా కనబడుతున్నారు. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు సొంతం చేసుకున్నాక ఆయనెంత హ్యాపీగా ఉన్నడో అనేది ఆయన కనిపిస్తున్న తీరు, సెలెబ్రేషన్స్ అన్ని చూపించాయి. కానీ అభిమానులు వారి సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా చూపిస్తున్నారు. కేక్ కట్ చేసుకుని పండగ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రకి నేషనల్ అవార్డు రాకముందు అల్లు ఫాన్స్ సోషల్ మీడియాలో పుష్ప 2 అప్ డేట్ కోసం యుద్ధమే చేసారు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చాక అదే జోష్ కంటిన్యూ చేస్తూ.. ఏ మాత్రం హైప్ తగ్గకుండా అల్లు అర్జున్-సుకుమార్లు పుష్ప 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు.. అతి త్వరలోనే పుష్ప ద రూల్ నుండి రిలీజ్ డేట్ అప్ డేట్ వచ్చేస్తుంది.. మేకర్స్ అదే ప్రయత్నంలో ఉన్నారంటూ వార్తలు రావడం అల్లు ఫాన్స్ లో మరింత జోష్ ని పెంచింది. 

అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడప్పుడే పుష్ప 2 రిలీజ్ డేట్ ఇవ్వడం లేదు అని, ఆ అనౌన్సమెంట్ కి ఇంకాస్త సమయం ఉంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో కనిపించడంతో అల్లు ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. అసలైతే వచ్చే ఏడాది మార్చి మూడో వారంలోనే పుష్ప 2 రిలీజ్ డేట్ ఉంటుంది..  ఆ డేట్ నే మేకర్స్ తొందరలోనే ప్రకటించనున్నారని అన్నారు. కానీ ఇప్పుడేమో సమయం ఉంది అంటున్నారు. మరి ఇది అల్లు అర్జున్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్ కాక ఇంకేమవుతుంది. 

Bad news for Allu Arjun fans:

Pushpa 2: Release date announcement to be made this week!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs