Advertisement
Google Ads BL

పెళ్లి చేసుకోవాలనుందంటున్న ముదురు భామ


టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టించుకున్న మాజీ హీరోయిన్ ప్రస్తుతం పోలిటీషియన్ గా కనిపిస్తున్న నగ్మా అంటే ఈ తరం వారికి సుపరిచయమే. ఒకప్పుడు మెగాస్టార్ చిరు, నాగార్జున, వెంకటేష్ తో కలిసి సూపర్ హిట్ మూవీస్ లో నటించింది. తెలుగునాట హీరోయిన్ గా బలమైన ముద్ర వేసిన నగ్మా ఆ తర్వాత అత్త పాత్రల్లోనూ మెరిసింది. తన సినిమా కెరీర్ లో సక్సెస్ అయినా.. పర్సనల్ లైఫ్ లో ప్రేమ మాత్రం బోలెడన్నిసార్లు విఫమైంది. క్రికెటర్ సౌరవ్ తో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపింది. ఇంకా రెండు మూడు బ్రేకప్స్ నగ్మా ని ఇబ్బంది పెట్టాయంటారు. 

Advertisement
CJ Advs

అయితే ఇన్నాళ్లు పెళ్లి చేసుకొని నగ్న ఇప్పుడు 48 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోవాలనుంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లి చేసుకోకుండా ఉండాలనేది నా కోరిక కాదు.. నాకు పెళ్లి చేసుకుని పిల్లలని కనీని.. ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఓ తోడు కావాలని ఉండేది. కాలం కలిసొస్తే త్వరలోనే నా పెళ్లి అవుతుందేమో.. నిజంగా పెళ్ళయితే చాలా హ్యాపీగా ఉంటుంది. సంతోషమనేది జీవితంలో కొంతలానికే పరిమితం కాదు కదా అంటూ నగ్మా ఇన్నాళ్ళ లైఫ్ లో పెళ్లిపై ఇలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడింది. 

తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నగ్మా పెరఫార్మెన్స్ పరంగా చాలా ఏళ్ల పాటు తన మార్క్ చూపించింది. నగ్మా 2008 లో నటనకు గుడ్ బై చెప్పాక రాజకీయాల్లోకి ప్రవేశించింది. అయితే నటనలో టాప్ రేంజ్ కి చేరిన నగ్మా రాజకీయాల్లో మాత్రం అంతంతమాత్రంగానే రాణించింది.

Veteran heroine Nagma comments on her Marriage:

 Nagma comments on her Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs