Advertisement
Google Ads BL

డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్ కి షాక్


కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కి డ్రగ్స్ కేసులో నోటీసులు అందడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్యన సౌత్ మూవీస్ తో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా బలమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన వరలక్ష్మి శరత్ కుమార్.. కోలీవుడ్ లోను భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. అయితే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ దగ్గర పిఎ గా పని చేస్తున్న ఆదిలింగం అనే వ్యక్తి డ్రగ్స్ నిందితుల్లో కీలకమైన వ్యక్తిగా చలామణి అవడం కొచ్చి పోలీసులు గుర్తించారు. 

Advertisement
CJ Advs

వరలక్ష్మి దగ్గర చాలా ఏళ్లుగా నమ్మకమైన వ్యక్తిగా పని చేసే ఆదిలింగానికి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో కీలకమైన సంబంధాలు ఉన్నాయనే పక్కా సంచారంతో ఆదిలింగాన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆదిలింగాన్ని కష్టడీలో ఉంచి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆదిలింగం  డ్రగ్స్ సప్లై చేస్తూ వచ్చిన డబ్బుతో సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. 

దానితో పూర్తి వివరాలని రాబట్టడానికి ఆదిలింగం పని చేసే వరలక్ష్మి శరత్ కుమార్ ని కూడా విచారించేందుకు NIA అధికారులు ఆమెకి నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా వరలక్ష్మి శరత్ కుమార్ కి ఆదిలింగం పలుమార్లు డ్రగ్స్ ఇచ్చినట్లుగా NIA అధికారులు అనుమానిస్తున్నారు. వరలక్ష్మితోనే కాకుండా ఇంకా కోలీవుడ్ లో ఎవరెవరితో ఆదిలింగం సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నడో అనే కోణంలో NIA అధికారులు ఆదిలింగాన్ని విచారిస్తున్నారు. 

Varalakshmi Sarathkumar in trouble:

Varalaxmi Sarathkumar Gets NIA Notice in Drug Case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs