Advertisement
Google Ads BL

మాసివ్ గా నా సామిరంగ


కింగ్ నాగార్జున సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి ఈ అక్టోబర్ కి ఏడాది పూర్తవుతుంది. ఘోస్ట్ డిసాస్టర్ తర్వాత నాగార్జున ఇప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ ప్రకాటించలేదు. ఈరోజు ఆగష్టు 29 నాగార్జున బర్త్ డే. ఆయన తన కొత్త చిత్రాన్ని నేడు అఫీషియల్ గా ప్రకటించడమే కాదు.. ఆ సినిమా టైటిల్ దానికి సంబంధించిన గ్లిమ్ప్స్ తో అక్కినేని ఫాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చారు. ఘోస్ట్ తర్వాత ఆరు నెలల బ్రేక్ అన్న నాగార్జున ఏకంగా ఏడాది బ్రేక్ తీసుకున్నారు. 

Advertisement
CJ Advs

ఏడాది బ్రేకిస్తేనేమి.. ఇప్పుడు ఆయన తన కొత్త ప్రాజెక్ట్ ని విజయ్ బిన్నీ దర్శకత్వంలో నా సామిరంగ గా ప్రకటించడమే కాదు.. ఊర మాస్ లుక్ తో అభిమానులని సర్ ప్రైజ్ చేసారు. ఈ పండక్కి పనైపోవాలి అంటూ నా సామి రంగ సంక్రాంతి రిలీజ్ అంటూ చెప్పకనే చెప్పారు. నా సామిరంగ గ్లిమ్ప్స్ లో నాగార్జున బీడీ వెలిగిస్తూ ఎంట్రీ ఇచ్చిన సీన్ కి విజిల్స్ పడుతున్నాయి. 

ఆ మాసివ్ లుక్ తోనే ఈసారి పండక్కి నా సామిరంగ అంటూ నాగార్జున తన నోటితోనే సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసేసారు. మరి ఏడాది ఎదురు చూస్తే చూసారు కానీ.. ఒక్క సినిమాని ప్రకటించి ఏకంగా నాలుగు అప్ డేట్స్ ఇచ్చి అభిమానులని నాగార్జున కూల్ చేసిన విధానమైతే సూపర్. టైటిల్, ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్, రిలీజ్ డేట్ ఇన్ని అప్ డేట్స్ ఒక్క రోజే అంటూ అక్కినేని అభిమానులు ఉబ్బి తబ్బిబైపోతున్నారు. ముఖ్యంగా నాగార్జున లుక్ చూసి మాసివ్ గా ఏమున్నాడురా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Nagarjuna New Film Titled Naa Saami Ranga,:

Naa Saami Ranga Theatrical Release For Sankranti 2024
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs