Advertisement

పడి లేచిన కెరటం.. సుమన్ బర్త్‌ డే స్పెషల్..


80వ దశకంలో ఎంటర్ అయిన కొత్త టాలెంట్ హీరోల్లో హ్యాండ్సమ్ హంక్‌ ఎవరంటే సుమన్‌ అని టక్కున గుర్తొస్తుంది. అద్భుతమైన నటన, అంతకుమించి కళ్లు చెదిరే అందం, మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యంతో స్టార్ హీరో రేంజ్‌కి దూసుకెళ్లారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినా కూడా తెలుగు ప్రేక్షకులు ఆయనను అక్కున చేర్చుకున్నారు. ఏ నటనానుభవం లేకుండా వెండితెరపై ప్రవేశించి.. ఏమాత్రం బ్యాక్‌గ్రౌండ్ లేకున్నప్పటకీ.. స్వయంకృషి, ప్రతిభతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. యాక్షన్ హీరోగా పేరున్నా.. అన్ని రకాల సినిమాలతో ఆడియన్స్‌ను మెప్పించిన సుమన్.. ఎన్టీఆర్ తర్వాత దేవుడు పాత్రలతో ఆశ్చర్యపరిచాడు. కానీ విధికి కన్నుకుట్టిందేమో కానీ అనుకోని అవాంతరాలతో నట జీవితానికి బ్రేక్ పడింది. సెకండ్ ఇన్నింగ్స్‌గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. మరోవైపు రాజకీయాలవైపు కూడా ఓ కన్నేస్తున్నారు. వైసీపీకి సపోర్టుగా ఉంటున్నారు అనుకుంటున్న తరుణంలో సినీ హీరోలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్‌ ఆయనకు ఆగ్రహం తెప్పించాయి. ఎవరైతే నాకేంటి అన్నట్టుగా దులిపి పారేశారు. నేడు సుమన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ, రాజకీయ ప్రస్థానాలపై ఓ లుక్కేద్దాం..

Advertisement

సినీ కెరీర్ ఇలా..!

తెలుగు ఇండస్ట్రీలో అప్పటి వరకూ శోభన్ బాబే అందగాడు అనుకున్న వారికి సుమన్‌లో కొత్త కోణం కనిపించింది. దీనికి మార్షల్ ఆర్ట్స్ కూడా తోడవ్వడంతో అతని ఫైట్స్ కూడా మన తెలుగోళ్లను బాగా ఆకట్టుకున్నాయి. ఆ ఆకర్షణకు దర్శకుడు వంశీ కూడా ఫిదా అయిపోయి.. ‘సితార’ సినిమాలో హీరోగా తీసుకున్నాడు. పల్లెటూళ్లలో నాటకాల కుర్రాడి పాత్రలో సుమన్ సూపర్ అనిపించుకున్నాడు. ఇక అప్పటి నుంచి అతనికి అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. దీంతో తమిళ పరిశ్రమను పూర్తిగా పక్కనబెట్టి తెలుగులోనే సినిమాలు చేయడం షురూ చేశాడు. ఆయన అందం, యాక్షన్ సీన్స్‌కు మనప్రేక్షకులు పడిపోయారు!. విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు.. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఎందరో యువకులు అప్పట్లో కరాటే కూడా నేర్చేసుకున్నారంటే సుమన్ గురించి ఇంతకుమించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరోవైపు.. క్లాస్, మాస్ మిక్స్ సుమన్ సినిమాలకు మహిళా ప్రేక్షకులూ అమాంతం పెరిగారు. ఇంతలోనే ఓ ఊహించని సంఘటన సుమన్ కెరీర్‌ను కుదిపేసింది. నీలి చిత్రాల్లో నటించాడంటూ సుమన్ ను అనూహ్యంగా అరెస్ట్ చేయడం ఒక్కసారిగా సినీ కెరీర్ పడిపోయింది. చేయని తప్పుకు కొన్నాళ్లు జైలు జీవితం తప్పలేదని అభిమానులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. జైలు నుంచి విడుదలయ్యాక ‘బందిపోటు’, ‘ఉక్కు సంకెళ్లు’, ‘ఉగ్రనేత్రుడు’, ‘నేరం నాది కాదు’, ‘రావుగారింట్లో రౌడీ..’ ఇలా వరుసగా అన్నీ సూపర్ హిట్ అయి మళ్లీ సుమన్ ను ఫామ్‌లోకి వచ్చాడు. జైలుకెళ్లాక సుమన్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు కానీ.. అప్పుడే తనలోని అసలు సిసలైన నటుడ్ని బయటపెట్టారు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు తగ్గినా.. ఆర్టిస్టుగా.. తండ్రిగా.. ఇతరత్రా పాత్రల్లో మెప్పిస్తున్నారు.

ఇక రాజకీయాలు ఇలా..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే ఎంతటి వారికైనా వెగటు పుట్టడం ఖాయం. నిన్న మొన్నటి వరకూ వైసీపీని వెనుకేసుకొచ్చిన వారికి సైతం ఈ టార్గెటింగ్ రాజకీయాలు.. అలాగే వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాక్కురావడంతో పాటు.. ఇటీవలి కాలంలో ఏపీ వైసీపీ నేతలు కొత్త ట్రెండ్‌ను అలవరుచుకున్నారు. తమకు మంచి చెబుదామని యత్నించిన సినిమా హీరోలను సైతం టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. రాజకీయాలపై నటుడు సుమన్ విరుచుకుపడ్డారు. మెగాస్టార్ చిరంజీవిని పకోడి గాడు అంటూ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన విమర్శలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సినిమాలతో రాజకీయ నాయకులకు పనేంటని నిలదీశారు. సినిమాలతో పాటూ హీరోలు, నటుల పారితోషికాలపై మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. అసలు సినీ ప్రముఖుల పారితోషికాలకు, రాజకీయాలకు సంబంధం ఏంటంటూ సుమన్ ఏకిపారేశారు. సినీ పరిశ్రమ వాళ్లు పకోడీగాళ్లు కాదని.. అలా విమర్శించిన వాళ్లే బజ్జీగాళ్లు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ నాయకులకు తగదని సుమన్ హితవు పలికారు.ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని సుమన్‌ ప్రశ్నించారు. చిరు ఒక్కరినే కాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సైతం టార్గెట్ చేయడం తనకు ఏమాత్రం నచ్చలేదన్నారు.

రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని రజనీకాంత్‌పై బురద చల్లడాన్ని ఆయన తప్పుబట్టారు.అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివాహాలపై చేస్తున్న విమర్శలపై కూడా సుమన్ స్పందించారు. రాజకీయ నాయకులకే రెండు, మూడు కుటుంబాలు ఉన్నాయన్నారు. కానీ తాను ఆ పేర్లను వెల్లడించబోనన్నారు. అసలు ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే రాజకీయాలకు పనికిరారనే చట్టం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. మరో వివాహం చేసుకోవడానికి సవాలక్ష కారణాలుంటాయని.. వాటన్నింటినీ పట్టించుకోకుండా పవన్ కల్యాణ్‌పై బురద చల్లడం కరెక్ట్ కాదన్నారు. అసలు పవన్ మూడు పెళ్లిళ్ల కారణంగా ఎవరికేం బాధ వచ్చిందని నిలదీశారు. పవన్ మాజీ భార్యలు న్యాయం కోసం మిమ్మల్ని ఏమైనా సంప్రదించారా? అని ప్రశ్నించారు. పవన్‌ను చేతనైతే రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు. వ్యక్తిగత దూషణలకు మాత్రం దిగవద్దని హితవు పలికారు. ఇక చంద్రబాబును సైతం సుమన్ ప్రశంసించారు. ఆయన విజన్ ఉన్న వ్యక్తి అని.. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని కొనియాడారు. అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లో రాణిస్తున్న సుమన్‌‌కు మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. కెరీర్‌లో మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని Cinejosh.Com మనస్పూర్తిగా కోరుకుంటోంది.

Happy Birthday to Suman :

 Suman Birthday Special
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement