Advertisement

పొలిటికల్ కక్ష సినిమాపై చూపిస్తారా


మీడియాలో ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీని ఎత్తేసేవాళ్ళు మరో పార్టీని విమర్శించడం, తమ యాంటీ పార్టీలపై విషం చిమ్మడం చూస్తుంటాము. కానీ ఈమధ్యన కొంతమంది మీడియా ప్రతినిధులు పొలిటికల్ గా సపోర్ట్ చేసే పార్టీపై సినిమాల్లో ఏమైనా కామెంట్స్ పడినా, లేదంటే ఆ పార్టీకి ఎమన్నా హాని తలపెట్టేలా సినిమా హీరోలు తమ సినిమాల్లో డైలాగ్స్ రాసుకున్నా, కాదు పొలిటికల్ గా ఉంటూ సినిమాలు చేసుకునే వారిపై పనిగట్టుకుని పగబట్టి విషం చిమ్మడం చేస్తున్నారు. 

Advertisement

ప్రత్యేకంగా ఓ వర్గం మీడియా అలా పొలిటికల్ కక్షని సినిమా హీరోలపై రుద్దుతున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలని తొక్కేయ్యడానికి ట్రై చేస్తున్నారు. కారణం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నడిపిస్తున్నారు. కాబట్టే ఆ ఫ్యామిలీ హీరోల ప్లాప్స్ చూసి ఓ మీడియా వర్గం పండగ చేసుకుంటుంది. పదే పదే ఆ ఫ్యామిలీ హీరోల డిజాస్టర్స్ ని పనిగట్టుకుని ఎత్తి చూపిస్తుంది. 

మెగా హీరోల సినిమాలు విడుదలకు ముందే విషం చిమ్మడం, విడుదలయ్యాక హిట్ అయినా, లేదంటే టాక్ తేడా వచ్చినా రోజుకో ఆర్టికల్ రాస్తూ కుళ్ళబొడుస్తూ బాధపెట్టడం ఆ మీడియా వర్గం చేస్తున్న ప్రయత్నం. మరి ఇది రాజకీయ కక్ష కాక మరేమనాలి. 

Politics and movies:

movies 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement