అల్లు అర్జున్ లో నాకు నచ్చిన విషయం ఏమిటంటే, మెగా అనే ముసుగులో లేకుండా, తన పని తాను చేసుకుంటున్నాడు 👌 ఇది మేమన్న మాట కాదు శ్రీరెడ్డి అన్నమాట.. సినిమా ఇండస్ట్రీలోని కొంతమందిని టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా కాంట్రవర్సీ ట్వీట్స్ చేసే శ్రీరెడ్డి తాజాగా అల్లు అర్జున్ ని తెగ పొగిడింది. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలుచుకోవడంపై అతన్ని ప్రశంసిస్తూనే Congratulations Allu Arjun on Winning Best Actor National Award 🙏 అని దానితో పాటుగా.. అల్లు అర్జున్ లో నాకు నచ్చిన విషయం ఏమిటంటే, మెగా అనే ముసుగులో లేకుండా, తన పని తాను చేసుకుంటున్నాడు 👌 అంటూ మెగా ఫ్యామిలీని కెలికిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది శ్రీరెడ్డి అన్నమాటే కాదు.. ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న న్యూసే. అల్లు అర్జున్ మెగా ట్యాగ్ నుండి బయటికొచ్చి అల్లు ఆర్మీ అనే అభిమాన గణాన్ని ఏర్పరుచుకున్నాడు. అలాగే మెగా హీరో అన్నప్పటికీ.. తన పనేదో, తన సినిమాలేవో అన్నట్టుగానే ఉంటున్నాడు. ఇక అల్లు అర్జున్ అప్పట్లో రామ్ చరణ్ బర్త్ డే కి సోషల్ మీడియాలో ట్వీట్ వేయకపోవడం పెద్ద దుమారమే రేపింది.
తాజాగా రామ్ చరణ్ అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా ఒకరోజు లేటుగా స్పందించడం ఆ ప్రచారానికి ఆద్యం పోసింది. ఇలా అల్లు అర్జున్-మెగా ఫ్యామిలీ నుండి దూరంగా ఉండబట్టే తాను ఈరోజు నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు, మెగా ముసుగులో లేకుండా తన పని తనకు చేసుకుంటున్నాడు అంటూ శ్రీ రెడ్డి ట్వీట్ చేయడంపై పలువురు పలురకాలుగా స్పందిస్తున్నారు.
మెగా అనేది అతనికి ముసుగు కాదు అమ్మలూ....!!
అతని చుట్టూ వలయంలా కాపాడే రక్షణ కవచం!! అంటూ మెగా ఫాన్స్ శ్రీరెడ్డి ట్వీట్ కి రియాక్ట్ అవుతున్నారు.