Advertisement
Google Ads BL

వన్ ఇయర్ బ్రేక్ పై సమంత క్లారిటీ


సమంత చెప్పాపెట్టకుండా సినిమాల నుండి వన్ ఇయర్ బ్రేక్ తీసేసుకుంది. సమంత షూటింగ్స్ కి గ్యాప్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో గత రెండు నెలలుగా ప్రచారం జరుగుతుంది. విజయ్ దేవరకొండ ఖుషి, సిటాడెల్ వెబ్ సీరీస్ షూటింగ్స్ అన్ని పూర్తి చేసిన సమంత ఖుషి ప్రమోషన్స్ కోసం కొద్దిగా టైం స్పెండ్ చేసి అమెరికా చెక్కేసింది. సమంత అమెరికా వెళ్ళింది కూడా ఆమె అనారోగ్య సమస్యలకి ట్రీట్మెంట్ తీసుకోవడానికే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

Advertisement
CJ Advs

అయితే సమంత ఓ ఏడాది సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటుంది అని సోషల్ మీడియాలో వార్తలు రావడమే కానీ.. ఇప్పటివరకు ఈ విషయంలో సమంత స్పందించిన సందర్భం లేదు. తాజాగా ఆమె ఖుషి ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో తన లైఫ్ గురించి, అలాగే తన బ్రేక్ విషయమై క్లారిటీ ఇచ్చింది. తాను 13 ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాను, బ్రేక్ కూడా తీసుకోలేదు, ప్రస్తుతం నేను కొత్తదశని అనుభవిస్తున్నాను, ఈ దశలో ఎక్కువగా ట్రావెలింగ్  చేస్తున్నాను, 

ఈ 13 ఏళ్లలో మొదటిసారి బ్రేక్ తీసుకున్నాను, లైఫ్ లో ఈ దశ కొత్తగా ఉంది.. అలాగే ప్రస్తుతం నా జీవితంలో నేను ఖుషిగానే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. మరి ఆమె ప్రయాణాల కోసమే బేక్ తీసుకుంటే ప్రోపర్ గా ఖుషి ప్రమోషన్స్ లో పాల్గొని వాటిని పూర్తి చేసి వెళ్లి ఉండేది, హెల్త్ కోసమే వెళ్ళింది కాబట్టి ఆమె ఇలా ప్రమోషన్స్ ని లైట్ గా ముగించేసి అమెరికా చెక్కేసింది అంటున్నారు నెటిజెన్స్. 

Samantha Clarity on One Year Break:

Samantha Clarity on Her Life
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs