Advertisement

కేసిఆరు.. భయపడుతున్నారు..


కోపంలోనో.. ఆందోళనలోనో.. లేదంటే విపరీతమైన భయంలో ఉన్నప్పుడో ఎలాంటి స్టెప్స్ తీసుకోకూడదు. తీసుకుంటే అది మనం చేసే పెద్ద తప్పిదమే అవుతుంది. ప్రస్తుతం గులాబీ బాస్ పరిస్థితి ఇదే. ఆయన తీసుకునే స్టెప్స్ అన్నీ చూస్తుంటే కేసీఆర్ భయపడుతున్నారనే సంకేతం జనంలోకి బాగా వెళ్లిపోతోంది. ఏ పార్టీ అయినా సరే.. రెండు సార్లు అధికారంలో ఉంటే ఆటోమేటిక్‌గా కాస్త ప్రజా వ్యతిరేకత అయితే వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ రెండు సార్లు అధికారంలో ఉన్నారు. మూడోసారి కూడా అధికారాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఇంత ముందుగా ఆయన అభ్యర్థుల జాబితాను వెలువరించడం ఒక వ్యూహాత్మక తప్పిదమే. టికెట్ రాని అభ్యర్థులు పార్టీ మారేందుకు చక్కగా టైం దొరికింది. 

Advertisement

ఇప్పటికే కొందరు జంప్.. మరికొందరిని మాత్రం ఎలాగో మంత్రి పదవి.. మరో పదవి గాలం వేసి పట్టుకోగలిగింది. ఇక ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న పనులన్నీ ఆయనకు బీభత్సంగా అధికారం కోల్పోతామనే భయం పెరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అభ్యర్థుల జాబితా ప్రకటించక ముందే తన కుమారుడికి టికెట్ కేటాయిస్తే ఓకే లేదంటే తన సత్తా ఏంటో చూపిస్తానని హెచ్చరికలు జారీ చేశారు మైనంపల్లి హనుమంతరావు. అంతటితో ఆగితే బాగానే ఉండు.. మంత్రి హరీష్ రావుపై ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించారు. అయినా సరే లిస్ట్‌లో ఆయన పేరు కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక పట్నం మహేందర్ రెడ్డి చేజారి పోకుండా ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. కేవలం మూడు నెలలు కూడా ఎన్నికలకు సమయం లేదు. ఇక మరో నెలన్నరలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఈ తరుణంలో మంత్రి పదవి కట్టబెట్టి ఆయన్ను బుజ్జగించారు.

ఇక చెన్నమనేని రమేష్ పార్టీని వదిలిపోతారేమోనన్న భయంతో ఆయనకు హడావుడిగా పదవిని కట్టబెట్టి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేశారు.ఇవన్నీ చాలవన్నట్టు గవర్నర్ తమిళిసై అంటే మండిపడే కేసీఆర్ ఆమెను స్వయంగా సెక్రటేరియట్‌కు ఆహ్వానించారు. గవర్నర్‌కు దగ్గరై బీజేపీకి సవాల్ విసురుదామనుకుంటే.. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న ప్రచారానికి మరింత ఆద్యం పోసినట్టైంది. ఇది ఊహించని కేసీఆర్ కంగుతిన్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిని ఓ అస్త్రంగా వినియోగించుకోనుంది. మరోవైపు తుమ్మల విషయంలోనూ కేసీఆర్‌లో టెన్షన్ మొదలైంది. వెంటనే ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు పిలిపించుకున్నారు. ఇదంతా చూస్తుంటే కేసీఆర్‌లో ఓటమి భయం ప్రారంభమైందని తెలుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బలపడుతుంటే తానేం చేస్తున్నానో తెలియని స్థితిలో కేసీఆర్ ఉన్నారంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి కేసీఆర్‌లో భయం మొదలైందని గులాబీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.

You are afraid KCR sir..:

KCR-BRS
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement