మెగాస్టార్ చిరంజీవి-బాలకృష్ణలు వయసులోనూ, కెరీర్ పరంగాను సమ ఉజ్జీలే. ఇద్దరూ చాలా సందర్భాల్లో చాలాసార్లు పోటీపడ్డారు. ఒక్కోసారి ఒక్కొక్కరు గెలిచారు. ఇక ఇండస్ట్రీ విషయంలో మాత్రం బాలయ్యది మెగాస్టార్ ది తలోదారి. అదాల ఉంటే ఈమధ్యన చిరంజీవి బిహేవియర్ ని-బాలయ్య బిహేవియర్ ని కంపేర్ చేస్తూ కొంతమంది అభిమానులు కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ముఖ్యంగా భోళా శంకర్ ఈవెంట్ లో చిరంజీవి ప్రవర్తించిన తీరు, స్కంద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలయ్య వ్యవహరించిన తీరుని కంపేర్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ కీర్తి సురేష్ తో వ్యవహరించిన తీరు ఆయన్ని విమర్శల పాలు చేసింది. ఆయన ఏజ్ ఏమిటి, ఆయన చేసిన పనులేమిటి అంటూ ట్రోల్ చేసారు. కీర్తి సురేష్ ని ఆ ఈవెంట్ లోనే కాదు పలు ఇంటర్వూస్ లో కూడా ఆమెతో సిల్లీగా ప్రవర్తించడంపై నెటిజెన్స్ ఆయన్ని తెగ విమర్శిస్తున్నారు. ఇక స్కంద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలకృష్ణ హీరోయిన్ శ్రీలీలని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించిన సీన్ చూసిన వారు బాలకృష్ణ సంస్కారం గొప్పది అంటూ మాట్లాడుతున్నారు.
బాలయ్య ఫాన్స్ అయితే రెచ్చిపోయి బాలయ్య శ్రీలీల ని అశీర్వదిస్తున్న పిక్ ని, మెగాస్టార్ కీర్తి సురేష్ తో హగ్ చేసుకున్న పిక్స్ ని పక్కనబెట్టి మరీ.. ఇది చిరంజీవికి మా బాలయ్య కి మధ్యన ఉన్న తేడా అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.