ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి కన్నా చేడు ఎక్కువైంది. సినిమా అప్ డేట్స్ వస్తున్నాయంటే.. దానిని పొగడడానికి అభిమానులు ఉంటారు. కానీ విమర్శించడానికి అభిమానులకన్నా ఎక్కువమంది జనాలు వచ్చేస్తున్నారు. ఫస్ట్ లుక్ లేదు, టీజర్ లేదు, ట్రైలర్ లేదు.. ఏదైనా కాస్త వీక్ గా కనబడితే చాలు దానిపై మీమ్స్ క్రియేట్ చేసి కామెడీ చేస్తున్నారు. తాజాగా రామ్-బోయపాటి స్కంద ట్రైలర్ పై పాజిటివ్ కన్నా ఎక్కువగా నెగిటివిటి సోషల్ మీడియాలో కనిపించింది.
రామ్ లుక్స్ వైజ్ గా, అలాగే డైలాగ్స్ వైజ్ గా సూపర్ అన్నవారే.. బోయపాటి మార్క్ యాక్షన్ ఉన్నప్పటికీ అది ఆయన గత సినిమాల్లోని యాక్షన్ సీక్వెన్స్, మిగతా సీన్స్ లా కనిపించాయంటున్నారు. జయ జానకి నాయక, సరైనోడు, అఖండ ఇలా బోయపాటి తన సినిమాల్లోని సీన్స్ ని స్కంద లో చూపించారంటున్నారు. అంతేకాకుండా రామ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ డైలాగ్స్ అండ్ మ్యానరిజమ్స్ కనిపించాయంటున్నారు. ఇక శ్రీలీల-రామ్ కాంబో సీన్ బావుంది కానీ అది వినయ విదేయరామలోని చరణ్ ఇంకా కియారా ని చూసినట్టే ఉంది అంటున్నారు.
అక్కడక్కడా ముక్కలని అతికించినట్టుగా స్కంద ట్రైలర్ ఉంది, దానిలో ఎలాంటి కొట్టడం కానీ, కథ కానీ, మిగతా ఎమోషన్స్ కానీ కనిపించలేదనే అభిప్రాయాలని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ ని ఇస్మార్ట్ శంకర్ లుక్స్ తో కంపేర్ చేసి మరీ కామెంట్స్ విసురుతున్నారు. అసలు బోయపాటి ఒక్క బాలయ్య కి తప్ప మిగతా హీరోలకి సెట్ కారు.. ఆయన బాలయ్యతో చేసే నరకుడు సీన్స్ అలాగే యాక్షన్ సన్నివేశాలు మిగతా హీరోయూ టచ్ చెయ్యలేరు.
రిలీజ్ కి 20 రోజుల ముందే స్కంద ట్రైలర్ విడుదల చేస్తే సినిమాపై బజ్ రావాలి కానీ.. ఇలా కామెడీ అవ్వకూడదు కదా, బోయపాటి ఇది ఒక్కసారి గమనించు అంటూ.. రామ్ అభిమానులు బోయపాటికి రిక్వెస్ట్ పెడుతున్నారు.