Advertisement
Google Ads BL

సుశాంత్ సింగ్ ఫ్లాట్ కొన్న ఆదా శర్మ ?


ద కేరళ స్టోరీ తో ఒక్కసారిగా ఫామ్ లోకొచ్చిన ఆదా శర్మ అంతకుముందు పెద్ద స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నా ఇంతగా పేరైతే రాలేదు. కేరళ స్టోరీ కాంట్రావర్సీ ఆ చిత్ర కలెక్షన్స్ కి బాగా హెల్ప్ అయ్యాయి. ఆదెబ్బకు ఆదా శర్మ పేరు కూడా మీడియాలో మోగిపోయింది. అయితే తాజాగా ఆదా శర్మ ముంబైలోని ఓ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అది దివంగత సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ నివసించి అక్కడే సూయిసైడ్ చేసుకున్న ఫ్లాట్ ని ఆదా శర్మ కొనుగోలు చేసింది అంటున్నారు. 

Advertisement
CJ Advs

సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ ఆ ఫ్లాట్ ని కొనుగోలు చెయ్యలేదు. ముంబై లోని బాంద్రా మౌంట్ బ్లాంక్ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ నెలకి దాదాపు నాలుగున్నర లక్షల అద్దె చెల్లిస్తూ ఉండేవాడు. ఆ ఫ్లాట్ లోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ ఫ్లాట్ ని ఆదా శర్మ కొనుగోలు చేసినట్లుగా మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. 

ఆదా శర్మ ఆ ఫ్లాట్ కి సంబదించిన చిన్న చిన్న రిపేర్లు చేయించుకుని త్వరలోనే తన పేరెంట్స్ తో కలిసి ఆ ఫ్లాట్ కి షిఫ్ట్ అవ్వబోతుంది అంటున్నారు. అయితే ఈ న్యూస్ ఇంత వైరల్ అవుతున్నా ఆదా శర్మ నుండి దీనిపై ఎలాంటి స్పందన లేదు. అసలు ఆమె ఆ ఫ్లాట్ ని కొన్నాదా..  లేదా.. అనేది తెలియాల్సి ఉంది.  

Adah Sharma buys flat SSR lived in before his death:

Is Adah Sharma Buying Sushant Singh Rajput Bandra Flat?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs