కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్-గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో క్రేజీ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ ప్రోగ్రెస్ గురించి అలాగే రిలీజ్ డేట్ కోసం మెగా ఫాన్స్ యుద్ధం చేస్తున్నా దర్శకనిర్మాతల్లో కదలిక లేదు. దిల్ రాజు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై చేతులెత్తేశారు. అంతా దర్శకుడు శంకర్ చేతిలో ఉంది అంటూ తప్పించుకున్నారు. మరోపక్క చరణ్ బర్త్ డే కి వదిలిన ఫస్ట్ లుక్ తప్ప గేమ్ ఛేంజర్ నుండి మరే లుక్ వదల్లేదు. కియారా బర్త్ డే వచ్చింది, శంకర్ బర్త్ డే వచ్చింది వెళ్ళింది.. ఎలాంటి అప్ డేట్ లేదు. దానితో మెగా ఫాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారు.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ భువనగిరి మండలం నాగిరెడ్డి గ్రామ పరిధిలో భీమరావ్ పల్లెలో జరుగుతుంది. అక్కడి రైస్ గోదాములో హీరో రామ్ చరణ్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ జరుగుతున్న కల్తీ బియ్యాన్ని పట్టుకునే సన్నివేశాల చిత్రీకరణని శంకర్ చేపట్టారు. చరణ్ ఆ సన్నివేశంలో ఆఫీసర్ లుక్ లో కనిపించిన పిక్ లీకై వైరల్ గా మారింది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు రకాల పాత్రల్లో కనబడుతున్నారు. ఓ లుక్ లో కాస్త ఏజ్డ్ గాను, మరో లుక్ లో మోడరన్ గా కనిపిస్తారు. ఇక విలన్ గా టాలెంటెడ్ నటుడు ఎస్ జె సూర్య కనిపిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరికొంతమంది పేరున్న నటులు కనిపించబోతున్నారు.