Advertisement
Google Ads BL

స్మగ్లర్ కి నేషనల్ అవార్డా.. విడ్డురం కాకపోతే..!


స్మగ్లర్ కి నేషనల్ అవార్డా..  విడ్డురం కాకపోతే..! ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న మీమ్స్ ఇవే. స్మగ్లర్ గా కనిపించిన హీరోకి ఉత్తమ జాతీయనటుడు అవార్డు ఎలా ఇస్తారు.. అసలు సిసలైన హీరోలకి ఇవ్వాలి, వారి కేరెక్టర్స్ ని గుర్తించారా అంటూ తమిళ తంబీలు సోషల్ మీడియా వేదికగా నేషనల్ అవార్డు కమిటీని ఏసుకుంటున్నారు. సూర్య జై భీమ్ కి అయినా లేదంటే మాధవన్ రాకెట్రి కి అయినా ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాల్సింది పోయి.. పుష్ప అంటూ విలన్ గా కనిపించి ఎర్రచందనం స్మగ్లింగ్ ని ప్రోత్సహించే కేరెక్టర్ కి అవార్డు ఇస్తారా అంటూ రచ్చ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

పై పోస్టర్ చూస్తే ఉత్తమ అవార్డు రావాల్సిన అన్ని అర్హతలు జై భీమ్ కి ఉన్నాయి. కానీ ఒక్క అవార్డు కూడా రాలేదు, ఇది పరిస్థితి. జై భీమ్ లాయర్ కేరెక్టర్ చేసిన సూర్య ఉత్తమ నటుడు, ఆ చిత్రం న్యాయాన్ని తెలియజేస్తుంది. కానీ పుష్ప మాత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ విలువని తెలియజేస్తుంది అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంపై తమిళ మీడియా, తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు చాలామంది పెద్ద ఎత్తున అసంతృప్తి తెలియజేస్తున్నారు. 

ఓ తెలుగు ప్రేక్షకుడు సోషల్ మీడియా వేదికగా.. అందరూ జై భీమ్ గురించి మాట్లాడుతున్నారు గానీ..

నా మానసంతా రాకెట్రీ మీదే ఉంది?

జాతీయ ఉత్తమనటుడు స్థాయి నటన నేను రాకెట్రిలో చూశా..

పుష్పలో బన్నీ, జై భీమ్ లో సూర్య బాగా చేశారు..

కానీ రాకెట్రీలో మాధవన్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్..

నాకు తెలిసి కమల్, మమ్ముటీ, మోహన్ లాల్ మాత్రమే చేయగిన పాత్ర అది?..

అలాంటి గొప్ప పాత్రను మాధవన్ చేసి మెప్పించాడు.. ఒప్పించాడు..

ఆ పాత్రలో యువకునిగా.. మధ్య వయస్కునిగా.. వృద్ధునిగా రకరకాల షేడ్స్ ఉంటాయి..

భావోద్వేగాలు.. అంతర్మథనాలు మిళితమైన పాత్ర అది..

అందరూ ఆ పాత్ర చేయలేరు..

మాధవన్ చేశాడు.. మెప్పించాడు..

ఏదేమైనా రాకెట్రీ.. రాకెట్రీ.. అంతే.. 🙏🏼

అయితే.. ఒక తెలుగువాడిగా మాత్రం మన బన్నీకి ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉంది..🙏🏼 అంటూ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. 

దీనిని బట్టి నేషనల్ అవార్డు విషయంలో ఏదో జరిగింది అనే అభిప్రాయాలని కొంతమంది వ్యక్తపరచడంలో వింతేమీ లేదు. మరి ఈ నేషనల్ అవార్డుపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి. 

National award to smuggler.. if not funny..!:

Pushpa vs Jai Bheem
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs