నేషనల్ అవార్డు ఏమిటి ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కొల్లగొట్టుకొచ్చిన ఆర్.ఆర్.ఆర్ ముందు ఏదైనా దిగడుపే అనుకున్నారు చరణ్-ఎన్టీఆర్ ఫాన్స్. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చిన ఊపులో తారక్-రామ్ చరణ్ లు నేషనల్ అవార్డ్స్ గెలిచినట్టుగా ఆ హీరోల అభిమానులు ఫీలయ్యారు. కానీ ఇప్పుడు ఆ నేషనల్ అవార్డ్స్ ఈ హీరోలలో ఏ ఒక్కరికీ దక్కకపోయేసరికి ఫాన్స్ ఉసూరుమంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ కి ఏకంగా ఆరు అవార్డు లొచ్చాయి.
ఆరు అవార్డులొచ్చినా తారక్, చరణ్ ఫాన్స్ లో ఉత్సాహం లేదు. ఎందుకంటే బెస్ట్ ఆక్టర్ కేటగిరిలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు ఉంటే.. ఇప్పుడు పుష్ప కి గాను అల్లు అర్జున్ బెస్ట్ ఆక్టర్ అవార్డు తన్నుకుపోవడం ఎన్టీఆర్-చరణ్ ఫాన్స్ లో ఉత్సాహాన్ని కప్పేశాయి. ఈ ఇద్దరిలో ఎవరికొచ్చినా అందరూ ఆనందపడేవారే. కానీ ఇప్పుడు ఈ ఇద్దరికి దక్కని ఆ అదృష్టం అల్లు అర్జున్ ని వరించేసరికి తట్టుకోలేకపోతున్నారు. అందరి కన్నా హైయెస్ట్ ఆరు జాతీయ అవార్డుని ఆర్.ఆర్.ఆర్ అందుకున్నా ఆ ఉత్సాహం ఆయా హీరోల అభిమానుల మొహంలో కనిపించడం లేదు.
కేవలం రెండు అవార్డులతో సరిపెట్టుకున్న పుష్ప బెస్ట్ యాక్టర్ కేటగిరిలో అవార్డు వచ్చేసరికి వీరు బాధపడుతున్నారు. మరి అంతేగా తమ హీరోకి అవార్డు రాలేదు అంటే బాధపడకుండా ఎలా ఉంటారు. కొమరం భీముడొ సాంగ్ లో ఎన్టీఆర్ పెరఫార్మెన్స్ కి, క్లైమాక్స్ లో అల్లూరు సీతారామరాజుగా అప్పీరియన్స్ ఇచ్చిన చరణ్ కి గాని, చాలా సిన్సియర్ గా జై భీమ్ చేసిన సూర్యకి గాని, సార్పట్ట కోసం ఎంతో శారీరక శ్రమ పడిన ఆర్యకైనా నేషనల్ అవార్డు వస్తే బావుండేదనే భిన్నాభిప్రాయాలను నెటిజెన్స్ వ్యక్తం చేస్తున్నారు.