Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ ఇంటి దగ్గర కోలాహలం


ఢిల్లీ వేదికగా జరుగుతున్న 69వ నేషనల్‌ ఫిల్మ్స్‌ అవార్డుల ప్రకటనలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ప్రతిష్ఠాత్మక పురస్కారం గెల్చుకున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పుష్ప చిత్రంలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ పెరఫార్మెన్స్ కి  గానూ ఈ పురస్కారం అందుకున్నాడు. జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న మొట్ట మొదటి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. 

Advertisement
CJ Advs

ఆర్.ఆర్.ఆర్ ఆరు జాతీయ అవార్డులని సొంతం చేసుకోగా.. పుష్ప ద రైజ్ కి 2 అవార్డులు, బెస్ట్ ఫిలిం గా ఉప్పెన, కొండపోలంకి ఒక జాతీయ అవార్డు సొంతమైంది. అయితే జాతీయ ఉత్తమనటుడిగా అవార్డు ని గెలుచుకున్న అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఆయన స్నేహితులు, పుష్ప మేకర్స్, దర్శకుడు సుకుమార్ తో కోలాహలంగా మారింది. అల్లు అర్జున్ బయటికొచ్చి తనకి అవార్డు వచ్చినందుకు సుకుమార్ అండ్ మైత్రి వారికి హగ్స్ ఇస్తూ ఆనందం వ్యక్తం చేసాడు. అల్లు అరవింద్ అయితే పుత్రోత్సాహంతో కనిపిస్తున్నారు. సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్, అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలియజేసేందుకు మారుతి, ఇంకా అల్లు అర్జున్ ఫ్రెండ్స్ అంతా అల్లు అర్జున్ నివాసం వద్దకు చేరుకుంటున్నారు. 

మరోపక్క అల్లు అర్జున్ అభిమానులు కూడా ఉత్సాహంగా అల్లు అర్జున్ నివాసానికి బారులు తీరారు. ఇక జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న ట్లుగా తెలియగానే సుకుమార్ అల్లు అర్జున్ ని హగ్ చేసుకుని పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న వీడియోస్ వైరల్ గా మారాయి. 

1st Telugu Actor to win the Best Actor National Award :

1st Telugu Actor to win the Best Actor National Award for PusphaThe Rise 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs