Advertisement
Google Ads BL

భగ భగలాడే పాటతో భగవంత్ ఎంట్రీ


భగవంత్ కేసరి ప్రమోషన్స్ బరిలోకి దిగాడు. కొద్దిసేపటి క్రితమే భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చింది. మన సినీజోష్ సైట్ లో గతంలో అప్ డేట్ ఇచ్చిన ప్రకారమే గణేష్ ఆంథెమ్ తో ఈ సినిమా తాలూకు పబ్లిసిటీ హంగామా ప్రారంభం కాబోతుంది. 

Advertisement
CJ Advs

ఈ గణేష్ ఆంథెమ్ కూడా అల్లాటప్పాగా లేదంట. అల్లాడించేలా ఉందంట. ఈ ఏడు వినాయక చవితికి అన్ని గణేష్ మండపాల్లోనూ గణగణ మోగిపోయే రేంజ్ లో ఆ సాంగ్ ఉందనేది ఇన్ సైడ్ రిపోర్ట్. థమన్ సంగతి తెలిసిందే కదా.. బాలయ్యని చూస్తే చాలు పూనకంతో ఊగిపోతూ డ్రమ్ములన్నీ దడదడలాడిస్తాడు. అందుకే ఎన్ని హోప్స్ అయినా పెట్టుకోవచ్చు. సరైన సాలిడ్ సాంగ్ తో భగవంత్ కేసరి ప్రభంజనం ప్రారంభం కాబోతుంది. 

ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం యావత్ నందమూరి అభిమానులంతా మురిసిపోతున్న విషయం బాలయ్య లుక్. ఆ పోస్టర్ లో బాలయ్యని ఆలా చూడగానే రెచ్చిపోతున్నారు అభిమానులు. పిచ్చెత్తిపోతున్నారు ప్రేక్షకులు. ఈమధ్య కాలంలో లుక్స్ వైజ్ చాలా కేర్ తీసుకుంటున్న బాలకృష్ణ భగవంత్ కేసరిలో కూడా బ్రహ్మాండమైన అప్పీరియన్స్ ఇచ్చి అదరగొట్టేసారు. ఇకపై మొదలు కాబోతుంది.. బాలకృష్ణ హవా.. భగవంత్ కేసరి సెగ.  

Bhagavanth Kesari Musical Promotions Set To Begin:

Bhagavanth Kesari Musical Promotions Set To Begin- Ganesh Anthem On Sep 1st
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs