Advertisement
Google Ads BL

చరణ్ తో సేతుపతి ఢీ


ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ కి విలన్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి అంటే తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయమే. సైరా లో చిరు తో కలిసి నటించిన విజయ్ సేతుపతి తమిళంలో నటించే సినిమాలని తెలుగు పేక్షకులు బాగానే ఆదరిస్తారు. విక్రమ్ తో డ్రగ్స్ సప్లేయిర్ గా ప్యాన్ ఇండియా ప్రేక్షకులని పడేసిన విజయ్ సేతుపతి జవాన్ తో హిందీలోకి విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హీరో-విలన్-కేరెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే విలక్షణ నటుడుగా అయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఉప్పెన చిత్రంలో కృతి శెట్టి కి ఫాదర్ గా విలనిజాన్ని చూపించారు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు బుచ్చిబాబు నుండి రాబోతున్న మరో మెగా బడ్జెట్ మూవీలోను విజయ్ సేతుపతినే విలన్ గా తీసుకురాబోతున్నారనే టాక్ వినబడుతుంది. రామ్ చరణ్ తో బుచ్చిబాబు మొదలు పెట్టబోయే ప్రాజెక్ట్ లో విలన్ కేరెక్టర్ కోసం విజయ్ సేతుపతితో చర్చలు జరుపుతున్నారని, రామ్ చరణ్ ని ఢీ కొట్టబోయే పవర్ ఫుల్ విలన్ గా  విజయ్ సేతుపతి కనిపిస్తారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో కానీ.. గతంలో అల్లు అర్జున్ పుష్పని విజయ్ సేతుపతి రిజెక్ట్ చేసారు. ఇప్పుడు చరణ్ కి ఓకె చెబుతారో.. లేదో.. అనే ఆత్రుత మెగా ఫాన్స్ లో ఉంది. 

బుచ్చి బాబు చరణ్ తో మొదలు పెట్టబోయే ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ లో సకల సౌకర్యాలతో కూడిన ఆఫీస్ ఒకటి ఓపెన్ చెయ్యబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కి అతి త్వరలోనే పూజ కార్యక్రమాలు నిర్వహించి సెట్స్ మీదకి వెళ్లేలా బుచ్చిబాబు రంగం సిద్ధం చేస్తున్నాడట.  

Buchi Babu Has Big Plans For Charan Project:

Vijay Setupathi vs Ram Charan 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs