Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 7 లోకి ఆ హీరోయిన్


బిగ్ బాస్ సీజన్ 7 మొదలు కావడానికి ఇంకా 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. సెప్టెంబర్ 3 ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ సీజన్ 7 బిగ్గెస్ట్ ఈవెంట్ తో ప్రారంభం కాబోతుంది. నాగార్జున హోస్ట్ గా మొదలవనున్న ఈ సీజన్ పై ఎవ్వరిలోను ఎలాంటి అనుమానాలు క్రియేట్ అవ్వకుండా.. ముందుగానే ఈ సీజన్ పై లీకులు లేకుండా యాజమాన్యం కట్టుదిట్టమైన ఏర్పాట్లని చేస్తుంది. అటు నాగార్జున కూడా గత సీజన్స్ లా ఈ సీజన్ రోటీన్ గా ఉండదు, ఉల్టా పల్టా అంటూ ఏదో అందరిలో సీజన్ 7 పై ఇంట్రెస్ట్ కలిగిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక మరో పది రోజుల్లో మొదలు కాబోయే ఈ సీజన్ లోకి జబర్దస్త్ వర్ష, సీరియల్ ఆర్టిస్ట్ లు అమరదీప్ ఆయన వైఫ్, ఈటివి ప్రభాకర్ లాంటి వాళ్ళు వెళుతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ప్రేమదేశం హీరో అబ్బాస్ ఈసారి బిగ్ బాస్ లోకి రాబోతున్నాడట. కొన్నేళ్లుగా సినిమా రంగానికి దూరంగా ఉంటున్న అబ్బాస్ ఈమధ్యన యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వూస్ ఇస్తూ తెలుగు, తమిళ హీరోల గురించి మట్లాడుతూ మళ్ళీ  ఫామ్ లోకి వస్తున్నాడు. అతను వెండితెర రీ ఎంట్రీ కోసమే బిగ్ బాస్ 7 కి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. 

అంతే కాకుండా అల్లరి నరేష్ హీరోయిన్ ఫర్జానా బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అంటున్నారు. అల్లరి నరేష్ తో రెండు మూడు సినిమాలు చేసి కనుమరుగైన ఫర్జానా మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యంతోనే బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయ్యి ఆడియన్స్ కి చేరువవ్వాలని ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇవన్నీ నిజాలా.. కదా అనేది సెప్టెంబర్ 3 గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ తో ఓ క్లారిటీ వచ్చేస్తుంది. 

Farzana to enter Bigg Boss 7 house:

Abbas and Farzana to enter Bigg Boss 7 house
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs