ఏపీ రాజకీయాల నుండి వారాహి విజయ యాత్ర నుండి విరామం తీసుకుని పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా షూటింగ్స్ తో బిజీ కాబోతున్నారు. బ్రో విడుదల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ మీదకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి డేట్స్ కేటాయించడంతో మేకర్స్ గబగబా అప్ డేట్ ఇచ్చేసారు. ఉస్తాద్ భగత్ సింగ్ మాసివ్ షెడ్యూల్ సెప్టెంబర్ 5 నుండి మొదలు కాబోతున్నట్టుగా సమాచారమిచ్చారు.
అయితే ఇప్పుడు షూటింగ్స్ కి కాస్త సమయం దొరకడంతో పవన్ కళ్యాన్ విదేశాలకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. భార్య అన్నా లేజ్నోవ అలాగే పిల్లలతో కలిసి పవన్ కళ్యాణ్ ఫారిన్ టూర్ వెళ్లారట. అక్కడే కొద్దిరోజులు ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేస్తారని, సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ తన బర్త్ డే సెలెబ్రేషన్స్ ఫ్యామిలీ మెంబెర్స్ సమక్షంలో విదేశాలలోనే జరుపుకోనున్నారని తెలుస్తోంది. అక్కడి నుండి రాగానే ఆయన ఉస్తాద్ సెట్స్ లోకి వెళ్ళిపోతారట.
ఇక అక్టోబర్, నవంబర్ రెండు నెలల్లోను పవన్ కళ్యాణ్ సుజిత్ మూవీ OG కి డేట్స్ కేటాయించారు. పవన్ కళ్యాణ్ OG సెట్స్ లోకి రాగానే సుజిత్ పవన్ పై కీలక సన్నివేశాల చిత్రరణ పూర్తి చేస్తారని తెలుస్తోంది.