Advertisement
Google Ads BL

Mega157: వశిష్ఠ భారీగానే ప్లాన్ చేశాడు


మెగాస్టార్ చిరంజీవితో బర్త్‌డే స్పెషల్‌గా ఫ్యాన్స్‌కి ట్రీట్ ఏమీ ఉండదనేలా ఇంతకు ముందు వార్తలు వినిపించాయి. కానీ, ఈ బర్త్‌డేకి అసలుసిసలైన ట్రీట్ Mega157 అనౌన్స్‌మెంట్ రూపంలో యూవీ వారు మెగా అభిమానులకు అందించారు. ప్రస్తుతం మెగాస్టార్.. తన మోకాలి సర్జరీ నిమిత్తం హైదరాబాద్‌లో అందుబాటులో లేరు. దీంతో.. ఈసారి చిరంజీవి పుట్టినరోజున మెగా ఫ్యాన్స్‌కి నిరాశ తప్పదు అనేలా టాక్ ప్రచారంలో ఉండగా.. వెంటవెంటనే రెండు సినిమాల ప్రకటనతో మెగా ఫ్యాన్స్‌ని ఖుష్ చేశారు మేకర్స్. అందులో మెగా 157 అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటే.. ఫ్యాన్స్‌కి కడుపునిండిపోతుంది. ఎందుకంటే..

Advertisement
CJ Advs

పంచభూతాలను చూపిస్తూ.. యూనివర్స్ వెనుక మెగా మాస్ అంటూ పోస్టర్‌ని రివీల్ చేసిన తీరు.. ఓ రేంజ్‌లో సినిమాని ఊహించుకునేలా చేస్తుంది. ఆల్రెడీ బింబిసార సినిమాతో వశిష్ఠ తనేంటో నిరూపించుకున్నాడు. మళ్లీ అదే తరహా..ఈసారి అంతకు మించి ఉంటుందనేలా.. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ క్లారిటీ ఇచ్చేస్తుంది. వాస్తవానికి ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. భూలోక వీరుడు టైటిల్ అని, ఓ అరడజను హీరోయిన్లు నటించనున్నారనేలా వార్తలు వచ్చాయి. ఈ పోస్టర్ చూస్తుంటే.. మెగాస్టార్‌తో వశిష్ఠ భారీగానే ప్లాన్ చేసినట్లుగా అయితే అర్థమవుతోంది. 

మరోవైపు మెగాస్టార్ తనయ సుస్మిత కూడా తన తండ్రితో చేయబోయే సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను విడుదల చేశారు. దర్శకుడు ఎవరనే విషయం చెప్పలేదు కానీ.. Mega156 తన బ్యానర్‌లోనే అనేలా క్లారిటీ ఇచ్చేసింది. భారీ స్థాయిలో సినిమా ఉంటుందని మాత్రం ఆమె చెప్పారు. అలాగే ఈ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఆమె విడుదల చేసిన మెగాస్టార్ పిక్‌లో.. ఆయన నటించిన సినిమాల పేర్లన్నీ ఉండటం విశేషం. మొత్తంగా అయితే.. మెగా ఫ్యాన్స్‌ డిజప్పాయింట్ అవకుండా.. చాలా కూల్‌గా అనౌన్స్‌మెంట్స్ వచ్చేశాయ్.

Mega 156 and Mega 157 Announced:

Superb Treat to Mega Fans and His Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs