Advertisement
Google Ads BL

రేవంత్‌రెడ్డిని తొక్కేందుకేనా కేసీఆర్ ఈ స్కెచ్?


టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు. గట్టిగా కాంగ్రెస్ నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చి పోరాడితే సీఎం కేసీఆర్‌ను దెబ్బతీయడం పెద్ద విషయమేమీ కాదు. చాలా వర్గాలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ వర్గాలన్నింటినీ ప్రసన్నం చేసుకోగలిగితే చాలు. ఇక తాజాగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారు. ఇప్పటి వరకూ రెడ్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ నుంచి కీలక పదవుల్లో ఉన్న వారంతా రెడ్డీలే కావడం గమనార్హం. అలాంటి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలంటే.. రెడ్డి ప్రాధాన్యత పెంచాలని కేసీఆర్ ఈ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది.

Advertisement
CJ Advs

మొత్తం 119 స్థానాలకు గానూ బీఆర్ఎస్ తన తొలి జాబితాలో 115 సీట్లలో అభ్యర్థులను ప్రకటించి 4 స్థానాలను పెండింగ్ పెట్టింది. సీఎం కేసీఆర్ తన తొలి జాబితాలో రెడ్డి 40 శాతం టికెట్లను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించారు. ఇలా గత రెండు ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేసింది లేదు. ఇక మొత్తంగా కేసీఆర్ ప్రకటించిన జాబితాను పరిశీలిస్తే.. సగం మంది ఓసీలే ఉన్నారు. మొత్తం 115 మంది అభ్యర్థుల్లో 58 మంది ఓసీ అభ్యర్థులే కావడం గమనార్హం. దీనిలో రెడ్డి సామాజిక వర్గం వారు 40 మంది, వెలమలు 11 మంది, కమ్మ సామాజికవర్గం వారు ఐదుగురు, బ్రాహ్మణులు, వైశ్యులు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇక రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీల  నుంచి మాత్రం 23 మందికే అవకాశం కల్పించారు. 

హాట్ టాపిక్‌గా మారిన రెడ్డి సామాజిక వర్గంలో ఏఏ నేతలు ఉన్నారంటే..

జి జగదీష్ రెడ్డి - సూర్యాపేట 

కె భూపాల్ రెడ్డి - నల్గొండ

కుసుంతల ప్రభాకర్ రెడ్డి – మునుగోడు 

పి కౌశిక్ రెడ్డి - హుజూరాబాద్

 పి సుదర్శన్ రెడ్డి – నర్సాపేట 

సి ధర్మా రెడ్డి – పర్కల్ 

కె ప్రభాకర్ రెడ్డి – దుబ్బాక 

సి మల్లా రెడ్డి - మేడ్చల్ 

బి లక్ష్మా రెడ్డి - ఉప్పల్ 

ఎం కిషన్ రెడ్డి – ఇబ్రహీంపట్నం 

డి సుధీర్ రెడ్డి - ఎల్‌బీ నగర్ 

పి సబితా ఇంద్రకరణ్ రెడ్డి - మహేశ్వరం 

జి వెంకటరమణా రెడ్డి – భూపాలపల్లి 

కె ఉపేందర్ రెడ్డి - పాలేరు 

ఎం పద్మా దేవేందర్ రెడ్డి – మెదక్ 

మహారెడ్డి భూపాల్ రెడ్డి – నారాయణఖేడ్ 

జి మహిపాల్ రెడ్డి – పటాన్‌చెరు

కె మహేష్ రెడ్డి - పరిగి

పైలట్ రోహిత్ రెడ్డి – తాండూరు 

టి అజిత్ రెడ్డి – మలక్ పేట 

ఎం సీతారాం రెడ్డి – చాంద్రాయణగుట్ట 

ఎస్ సుందర్ రెడ్డి – యాకుత్పురా 

పి నరేందర్ రెడ్డి – కొడంగల్ 

ఎస్ రాజేందర్ రెడ్డి - నారాయణపేట 

సి లక్ష్మా రెడ్డి - జడ్చర్ల 

ఎ వెంకటేశ్వర్ రెడ్డి – దేవరకద్ర 

సి రామ్ మోహన్ రెడ్డి – మక్తల్ ఎస్

నిరంజన్ రెడ్డి - వనపర్తి 

బి కృష్ణ మోహన్ రెడ్డి – గద్వాల్ 

మర్రి జనార్ధన్ రెడ్డి - నాగర్ కర్నూల్ 

పోచారం శ్రీనివాస్ రెడ్డి – బాన్సువాడ 

వేముల ప్రశాంత్ రెడ్డి – బాల్కొండ 

దాసరి మనోహర్ రెడ్డి – పెద్ద పల్లి

బి హర్షవర్ధన్ రెడ్డి – కొల్లాపూర్ 

ఎస్ సైది రెడ్డి - హుజూర్‌నగర్ 

పైళ్ల శేఖర్ రెడ్డి – భువనగిరి

ఎ ఇంద్రకరణ్ రెడ్డి - నిర్మల్ 

జి విఠల్ రెడ్డి - ముధోల్ 

ఎ జీవన్ రెడ్డి – ఆర్మూర్

Is this sketch of KCR to trample Revanth Reddy?:

BRS releases its first candidate list
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs