Advertisement
Google Ads BL

హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా..


 

Advertisement
CJ Advs

ఆగస్ట్ 22.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. మెగా ఫ్యాన్స్‌కి పండగరోజు. చిరు పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా.. అన్నయ్యా హ్యాపీ బర్త్‌డే అంటూ తమ్ముళ్లు ఎంతో ఆప్యాయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ అన్నయ్యకు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా.. మెగాస్టార్‌కు బర్త్‌డే విశెష్ తెలియజేశారు. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది అంటూ.. మెగాస్టార్‌ అంటే ఏంటో ఒక్కమాటలో చెప్పేశారు పవర్ స్టార్. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. పవన్ కళ్యాణ్ విడుదల చేసిన లేఖలో ఇంకా ఏం తెలిపారంటే..

అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు

అన్నయ్య చిరంజీవిగారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా  కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy Birthday Annayya ..!

Power Star Birthday Wishes to Mega Star:

Pawan Kalyan Says Birthday Greetings to Mega Star Chiranjeevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs