Advertisement
Google Ads BL

రెండు నెలలు మాయం కానున్న శ్రీలీల


ప్రస్తుతం టాలీవుడ్ ని ఒంటి చేతితో చక్కబెడుతున్న హీరోయిన్ శ్రీలీల. ఆమె ప్రతి యంగ్ హీరో సినిమాలో నటిస్తుంది. మరోపక్క స్టార్ హీరోలని వదలడం లేదు. ఇక వచ్చే నెల మొదలు శ్రీలీల నెలకోసారి యంగ్ హీరోలతో కలిసి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ 19 న రామ్ స్కంద తో శ్రీలీల ఈ ఏడాది ప్రేక్షకుల ముందుక ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ తదుపరి నెల అక్టోబర్ 19 న బాలయ్య సినిమా భగవంత్ కేసరితో రాబోతుంది. 

Advertisement
CJ Advs

నవంబర్ 10 న వైష్ణవ తేజ్ ఆదికేశవ్ తో, డిసెంబర్ నితిన్ ఎక్స్ట్రా మూవీతో శ్రీలీల హావ కనిపించనుంది. ప్రస్తుతం డే అండ్ నైట్ షూటింగ్స్ తో బిజీగా ఉంటూనే చదువును కంటిన్యూ చేస్తున్న శ్రీలీల ఇప్పుడు రెండు నెలల పాటు సినిమాల సెట్స్ లో కనిపించదట. శ్రీలీల MBBS చదువుతోంది. నవంబర్, డిసెంబర్ రెండు నెలలు ఆమెకి పరీక్షలు ఉన్నాయట. అందుకే ఆమె ఆ రెండు నెలలు ఏ షూటింగ్స్ కి హాజరవదని తెలుసస్తుంది. 

గత ఏడాది కూడా శ్రీలీల నవంబర్, డిసెంబర్ లని పరీక్షల కోసం కేటాయించింది. ఇక ఈ ఏడాదితో ఆమె MBBS చదువు పూర్తవుతుంది. మరి ఇటు వెండితెర మీద క్రేజీ  హీరోయిన్ గా మారిన శ్రీలీల అటు MBBS లాంటి ఉన్నత చదువుని పూర్తి చెయ్యడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.  

Sreeleela will be gone for two months:

November and December are fully reserved for heroine Sreeleela
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs