సమంత ఇక్కడున్నా వర్కౌట్స్ కి ప్రిఫరెన్స్ ఎక్కువిస్తుంది. వెకేషన్స్ కి వెళ్లినా వర్కౌట్స్ వదలదు, ఇప్పుడు అమెరికా వెళ్ళింది అక్కడ కూడా వర్కౌట్స్ ఆపకుండా చేస్తూనే ఉంది. హెల్త్ కోసము, గ్లామర్ కోసము, ఫిట్ నెస్ కోసము సమంత ఇలా రెగ్యులర్ గా జిమ్ లో వ్యాయామం చేస్తూ కష్టపడుతూనే ఉంటుంది. అయితే మాయోసైటిస్ వలన ఇబ్బంది పడుతున్న సమంత ఇలా చమటలు కారేలా వర్కౌట్స్ చెయ్యడం అనేది బాగోలేదు అంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే హెల్త్ ట్రీట్మెంట్ కోసం సమంత రీసెంట్ గానే అమెరికా వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే. అమెరికాలో అడుగు పెట్టిన ఫస్ట్ డే నే సమంత న్యూయార్క్ సిటీ అంతా రౌండ్స్ వేసేసింది. అక్కడ తాను చూసిన ప్రదేశాలని, నచ్చిన ప్రదేశాలని ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి లంచ్ చేసిన పిక్, లిబర్టీ అఫ్ స్టాట్యూ దగ్గర దిగిన పిక్, అలాగే వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ పోస్ట్ చేసింది.
న్యూయార్క్ గాలిలో ఏదో మహిమ ఉంది అంటూ సమంత సరదాగా క్యాప్షన్ పెటింది. సమంత అమెరికా వర్కౌట్స్ చూసిన నెటిజెన్స్ ఏంటమ్మా సమంత అమెరికా వెళ్లినా ఆపవా అంటూ ఆట పట్టిస్తున్నారు.