చిన్న గ్యాప్ వచ్చినా, పిల్లలకి హాలిడేస్ వచ్చినా మహేష్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ అంటూ ఫ్లైట్ ఎక్కడానికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చేస్తారు. మహేష్ అలా కారు దిగగానే ఎయిర్ పోర్ట్ ఫోటో గ్రాఫర్స్ అలెర్ట్ అవుతారు. మహేష్ అలాగే ఆయన ఫ్యామిలీ ఫొటోస్ ని, వీడియోలని తీసి వైరల్ చేస్తూ ఉంటారు. దానితో నెటిజెన్స్ మహేష్ హాలిడే వెకేషన్స్ పై రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పుడైతే మహేష్ గుంటూరు కారం షూటింగ్ పక్కనబెట్టి మరీ తరచూ వెకేషన్స్ కి వెళుతున్నారని విమర్శిస్తున్నారు.
తాజాగా బిగ్ సి మొబైల్స్ ప్రమోషనల్ కార్యక్రమంలో మహేష్ కి ఇదే ప్రశ్న ఎదురయ్యింది. మీరు తరచూ వెకేషన్స్ కి వెళుతూ ఉంటారు. దీనిపై వచ్చే విమర్శనాత్మక వార్తలు మీదాకా చేరుతాయా అని అడగగానే.. నేను వెకేషన్స్ కి వెళితే మీకేంటి ప్రాబ్లెమ్.. నన్ను చూసి ఈర్ష్య పడుతున్నారా అంటూ మహేష్ సరదాగానే తనపై వచ్చే విమర్శలకి ఆన్సర్ ఇచ్చారు. తనకి చిన్న గ్యాప్ వచ్చినా, పిల్లలకి సెలవలు దొరికినా చిన్నపాటి వెకేషన్ ప్లాన్ చేసుకుంటాము.
అలా నేను ఫొటోస్ ఇన్స్టా లో షేర్ చేస్తేనేగా నేను వెకేషన్ లో ఉన్నాను అని తెలిసేది. నా ఫోటోలు మీకు నచ్చుతాయనుకుంటున్నాను, అయినా నేను హాలీడేస్ కి వెళితే వేరే వారికీ నచ్చకపోవడానికి ఏముంటుంది, కొంతమంది ఈర్ష్యపడతారేమో నాకు తెలియదు అంటూ మహేష్ నవ్వుతూనే తనపై వచ్చే విమర్శలకు సమాధానమిచ్చారు.
మరి మహేష్ ఇంత స్పష్టంగా తన హాలిడే వెకేషన్స్ పై ఇచ్చిన ఆన్సర్ తో అయినా ఆయన హాలిడే ట్రిప్స్ పై అరవడం ఆపుతారో.. లేదో.. జస్ట్ వెయిట్ అండ్ సి.