Advertisement
Google Ads BL

మహేష్ చెప్పిన ఫ్యామిలీ కబుర్లు


బిగ్ సి మొబైల్ కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహేష్ ఈ రోజు దాని పబ్లిసిటీలో భాగంగా మీడియా ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో.. తన సినిమాల విషయాలతో పాటుగా.. తన ఫ్యామిలీ గురించి మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. 

Advertisement
CJ Advs

సేవ చేయాలనే స్ఫూర్తి చిన్నప్పటినుంచి వుంది. గౌతమ్‌ పుట్టిన తర్వాత ఎంబీ ఫౌండేషన్ కి శ్రీకారం చుట్టాం. చిన్నారుల గుండె ఆపరేషన్లకు నా వంతు సహకారం అందిస్తున్నా.  అలాగే రీ-రిలీజ్‌ల ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా సాయం కోసమే ఇస్తున్నా. ఈ విషయంలో నాకు చాలా తృప్తి వుంది. . అని చెప్పిన మహేష్ ఇంకా మీడియా వారు అడిగిన ప్రశ్నలకి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. 

మహేష్ గారు.. స్మార్ట్ ఫోన్ రోజులో ఎంత సమయం వాడుతారు ?

మీ అందరిలానే చాలా సమయం వాడుతాను. ఒకొక్కసారి తలకాయ నొప్పి వచ్చి ఆపేయడానికి కూడా ప్రయత్నిస్తాను( నవ్వుతూ).

మీరు వాడే ఫోన్ ఏమిటి ? ఎన్ని ఫోన్లు మారుస్తారు ?

నేను చెప్పను. నేను తిరిగేటప్పుడు మీరే పరిశీలించండి( నవ్వుతూ)

మీరు అంబాసిడర్‌ గా చేసిన ప్రొడక్ట్స్ ని వాడుతారా  ?

బిగ్ సి లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని వాడాను.

మీరు తీసిన ఫొటోస్ లో బాగా గుర్తుండిపోయిన ఫోటో ఏది ?

చాలా ఉంటాయండి.

ఫోన్ వాడకంలో మీ పిల్లలకు కూడా స్వేచ్ఛ ఇస్తారా ?

నేను ఇవ్వడం ఏమిటి .. వాళ్ళే తీసుకున్నారు (నవ్వుతూ)

మీ ఫోన్ రింగ్ టోన్ ఏమిటి ?

నాది సైలెంట్‌ టోన్‌  (నవ్వుతూ).  

మీరు ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళినపుడు మీ అనుభూతి ఎలా వుంటుంది ?

నాకు సంబంధించిన వస్తువులన్నీ నా భార్య కొనుక్కొని తీసుకొస్తుంది. అయితే నేరుగా వెళ్లి బిగ్ సి లాంటి స్టోర్స్ లో ఫోన్ కొనుక్కోవడంలో ఆనందం వేరుగా వుంటుంది.

Mahesh Babu shares family secrets :

Mahesh Babu about family secrets 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs