సోహెల్ హీరోగా తెరకెక్కిన మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ సక్సెస్ మీట్ లో ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి స్టార్ హీరోల సినిమాల రీరిలీజ్ లపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రెజెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ బాగా ఎక్కువైంది. స్టార్ హీరోలు నటించిన సినిమాలని మొన్నటివరకు ఆయా హీరోల పుట్టిన రోజుల సందర్భంగా సరదాగా 4K లో రీ రిలీజ్ లు చేస్తున్న అభిమానులు, మేకర్స్.. ఈమధ్యన అర్ధం పర్ధం లేకుండా ఏ సమయమైతే మాకేంటి అంటూ ఇష్టం వచ్చినప్పుడు రీ రిలీజ్ లు చేస్తున్నారు. దాంతో ఆయా హీరోల అభిమానులు రచ్చ థియేటర్స్ దగ్గర మితిరిపోతుంది.
ఇప్పుడు ప్రొడ్యూసర్ అప్పి రెడ్డి ఆ రీరిలీజ్ లపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నిర్మాతలు రీరిలీజ్ చేసే సమయాలను మార్చుకోవాలని ఆయన మిస్టర్ ప్రెగ్నెంట్ సక్సెస్ లో అభిప్రాయపడ్డారు. ఎందుకంటే శుక్రవారం స్టార్ హీరోల సినిమాలని 4K లో రీ రిలీజ్ చేస్తుంటే చిన్న నిర్మాతలు నష్టపోతారని, చిన్న సినిమాలు రిలీజయ్యే రోజు బడా సినిమాలను రీరిలీజ్ చేయడం ఆపాలని.. తాను రీరిలీజ్ లకి వ్యతిరేఖం కాను.. కానీ శుక్రవారం కాకుండా అవి ఏ సోమ, మంగళవారాల్లో ఈ విడుదల చేసుకుంటే బాగుంటుంది.
అలా చెయ్యడం వలన చిన్న నిర్మాతలకు ఎటువంటి నష్టం కూడా ఉండదు. ఈ విషయంపై త్వరలోనే ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో కూడా మాట్లాడతాను అని అప్పిరెడ్డి అన్నారు. ఆయన ఇలా ఎందుకు మట్లాడారు అంటే.. మిస్టర్ ప్రెగ్నెంట్ విడుదలైన రోజున ప్రభాస్ యోగి 4K లో రీరిలీజ్ అయ్యింది. దానితో మిస్టర్ ప్రెగ్నెంట్ కి పెద్దగా ప్రేక్షకులు రాలేదు.. కలెక్షన్స్ తగ్గాయనే అభిప్రాయంతోనే అప్పిరెడ్డి అలా మట్లాడారు అని తెలుస్తోంది.