ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-ప్యాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సెప్టెంబర్ 28 రాబోతున్న సలార్ మూవీపై ప్యాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలున్నాయి. హై బడ్జెట్ తో రూపొందిన సలార్ ని రెండు భాగాలుగా విడుదల చెయ్యబోతున్నారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో చిత్రం బృందం తలమునకలై ఉంది. ప్రభాస్ సలార్ ప్రమోషన్స్, అలాగే కల్కి షూటింగ్స్ కి రెడీ అవుతున్నారు.
సలార్ విడుదలకు కేవలం 38 రోజులే ఉండడంతో ప్రభాస్ ఫాన్స్ ఇంకా ప్రమోషన్స్ మొదలు కాలేదు అంటూ తెగ ఫీలైపోయి ఆందోళన పడిపోతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. ప్రమోషన్స్ కోసం ఓ ప్రవేట్ జెట్ తీసుకుని అన్ని నగరాలని కవర్ చెయ్యాలని భావిస్తున్నారట.
అయితే తాజాగా ప్రభాస్ ఫ్యాన్ ఒకరు సలార్ పై ఓ క్రేజీ న్యూస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దానితో ప్రభాస్ ఫాన్స్ ఎగబడి దానికి లైక్స్, షేర్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు. SALAAR మూవీలో ఒక సీన్ ఉంటది భయ్యా ఒక్క ప్రభాస్ ని 1000 మంది చుట్టూ ముడతారు 🔥💥 ఇంకో ప్రభాస్ వచ్చి కాపాడుతాడు ఆ సీను వీర లెవెల్ 🔥🔥 ఆ ఒక్క సీను చాలు భయ్యా 🤯 Sep 28 థియేటర్స్ పగిలిపోతాయి 💥💥.. అంటూ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది.
అయితే అది రూమరా లేదంటే నిజమా అనేది తెలియకపోయినా.. ప్రభాస్ ఫాన్స్ మాత్రం తెగ సంతోషపడిపోతున్నారు.