వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఈనెల 24 న ఇటలీలో వివాహం చేసుకోబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. కానీ అదంతా రూమర్ అని తేలిపోయింది. వరుణ్ తేజ్ తాజాగా లావణ్య తో తన ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి విషయాలను మీడియా తో పంచుకున్నాడు. తమ పెళ్లి సింపుల్ గానే హైదరాబాద్ లో జరగాలని కోరుకుంటున్నాను, హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఇక్కడే పెళ్లి చేసుకోవడం ఇష్టం.
కానీ పెళ్లి అనేది ప్రవేట్ ఈవెంట్ ఫంక్షన్. అందుకు హైదరాబాద్ లో సెక్యూరిటీ రీజన్స్ తలెత్తుతాయి. అందుకే మేము డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటున్నాము. ఇప్పటికే ఇండియాలో మూడు ప్లేస్ లు, విదేశాల్లో రెండు ప్లేస్ లు పరిశీలనలో ఉంచాము. త్వరలోనే మా పెళ్లి వేదిక ఎక్కడ అనేది ప్రకటిస్తాము.
నేను లావణ్య నవంబర్ లో కానీ, డిసెంబర్ లో కానీ వివాహం చేసుకోవాలనుకుంటున్నాము అంటూ వరుణ్ తేజ్ తమ వెడ్డింగ్ ప్లాన్స్ రివీల్ చేసాడు.