రామ్ చరణ్ నిన్న సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. గేమ్ చెంజర్ షూటింగ్ అలాగే తన కుమార్తె క్లింకార తో టైం స్పెండ్ చేస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు ఉన్నట్టుండి ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమయ్యారు. అయితే రామ్ చరణ్ హైదరాబాద్ నుండి చెన్నైకి వెళ్లాడు అక్కడ కోలీవుడ్ దర్శకుడు, గేమ్ చెంజర్ డైరెక్టర్ శంకర్ బర్త్ డే వేడుకల్లో పాల్గొనేందుకు చరణ్ ఇలా స్పెషల్ ఫ్లైట్ లో చెన్నై వెళ్లాడు.
అక్కడ శంకర్ పుట్టిన రోజు పార్టీలో పలువురు తమిళ దర్శకులతో కలిసి ఫొటోలకి ఫోజులిచ్చారు. లోకేష్ కనగరాజ్, విగ్నేష్ శివన్ ఇలా చరణ్ ఆ పార్టీలో పాల్గొన్న తమిళ దర్శకులతో కలిసి ఫోటోలు దిగాడు. రామ్ చరణ్, శంకర్ తో కలిసి ఓ పిక్ దిగి సోషల్ మీడియాలో థమన్ షేర్ చేసాడు. శంకర్ బర్త్ డే కి ఒకరోజు ముందుగానే గేమ్ చెంజర్ టీం తో కలిసి చరణ్ సెట్ లోనే శంకర్ తో కేక్ కట్ చేయించి ఆయన బర్త్ డే ని సెలెబ్రేట్ చేసారు.
నిన్న రాత్రి శంకర్ తన 60 వ బర్త్ డే వేడుకలని ప్రముఖుల మధ్యన సెలెబ్రేట్ చేసుకున్నారు. చరణ్ చెన్నై వెళ్లి అక్కడ పార్టీలో పాల్గొన్న పిక్స్ వైరల్ గా మారాయి. చరణ్ గేమ్ చెంజర్ షూటింగ్ తో పాటుగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తో కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడు. అది ఈ నెలలోనే ఉండొచ్చనే ఉహాగానాలు ఉన్నాయి.