Advertisement
Google Ads BL

రెండులక్షలిచ్చినా జబర్దస్త్ కి పోను


ఈటీవీలో ప్రసారమయ్యే అతి పెద్ద కామెడీ షో జబర్దస్త్ లో అవకాశం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా అవకాశాలు తగ్గాక  తాగుబోతు రమేష్ వంటి వారే జబర్దస్త్ ని వెతుక్కుంటూ వచ్చారు. ఇక వేణు, ధనరాజ్, శ్రీను లాంటి వాళ్ళు జబర్దస్త్ నుండి బయటికొచ్చాక సినిమాల్లో టాలెంట్ చూపిస్తుంటే.. సుడిగాలి సుధీర్, ఆది లాంటి కమెడియన్స్ జబర్దస్త్ లో పాపులారిటీ సంపాదించుకుని హీరోగా, డైలాగ్ రైటర్స్ గా సెటిల్ అయ్యారు. అవి చూసే చాలామంది జబర్దస్త్ లాంటి ప్లాట్ ఫామ్ మీద అవకాశం రావాలని చాలా ట్రై చేస్తారు. కానీ ఇప్పుడొక నటుడు జబర్దస్త్ లో తనకి రెండు లక్షల పారితోషకం ఇచ్చినా వెళ్లనంటున్నాడు. 

Advertisement
CJ Advs

అతనే జోష్ రవి.. దాదాపు 100 సినిమాలు చేసినా కూడా అతను 20, 30 సినిమాల్లో మాత్రం పాపులర్ అయ్యి.. మిగతా వాటిలో నామమాత్రపు పాత్రలతో సరిపెట్టుకున్న రవి.. తాజాగా మట్లాడుతూ తాను సిల్వర్ స్క్రీన్ మీదకి రాకముందు ఎంతో కష్టపడ్డాను.. సినిమాల్లో నటించాను. నాకు గుండెజారి గల్లంతయ్యింది మూవీలో గే పాత్ర మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వస్తే.. తాను ఇకపై అలాంటి ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది అని వాటిని ఒప్పుకోలేదు. జబర్దస్త్ యాజమాన్యం నాకు రెండు లక్షల పారితోషకం ఇస్తానన్నా వెళ్ళను. 

ఇంతకుముందు గెస్ట్ గా జబర్దస్త్ కి చాలాసార్లు వెళ్ళాను. అయితే జబర్దస్త్ ఛాన్స్ వచ్చి అక్కడికి వెళ్లి కామెడీ చేస్తే రెండు వేలు పారితోషకమే ఇచ్చారు. అందుకే ఇకపై జబర్దస్త్ కి పిలిచి రెండు లక్షలిస్తాను అన్నా వెళ్ళను. నేను సినిమాల్లోనే ప్రూవ్ చేసుకుంటాను అంటూ జబర్దస్త్ పై జోష్ రవి సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.

Josh Ravi comments on Jabardasth:

Actor Josh Ravi Shocking Comments On Jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs