Advertisement
Google Ads BL

దగ్గుబాటి ఫ్యామిలిలో మోగనున్న పెళ్లి భాజాలు


దగ్గుబాటి మూడో తరం వారసుల్లో వెంకటేష్ తన కూతురికి అంగరంగ వైభవంగా వివాహం చెయ్యగా.. సురేష్ బాబు కొడుకు, హీరో రానా మాత్రం లాక్ డౌన్ లో ప్రేమించిన అమ్మాయి మెహిక మెడలో సింపుల్ గా మూడు ముళ్ళు వేసాడు. కేవలం దగ్గుబాటి ఫ్యామిలీ, రామ్ చరణ్, నాగ చైతన్య, సమంత, మెహిక కుటుంభం ఇలా అతి కొద్దిమంది మాత్రమే రానా పెళ్ళికి హాజరయ్యారు. కోవిడ్ లోనే సింపుల్ గా అంగరంగ వైభవంగా రానా వివాహం జరిగిపోయింది. ఇప్పుడు మరోమారు దగ్గుబాటి ఫ్యామిలిలో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. 

Advertisement
CJ Advs

సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అహింస మూవీతో వెండితెరకు హీరోగా పరిచయమైన అభిరామ్ ని మొదటి సినిమానే బాగా నిరాశపరిచింది. ఆ తర్వాత అభిరామ్ చాలా సైలెంట్ గా కనిపిస్తుండగా.. ఇప్పుడు సడన్ గా అభిరామ్ పెళ్లిపై ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిరామ్ తన రిలేటివ్ అమ్మాయినే అంటే.. కారంచేడుకు చెందిన చినతాత కూతురు కూతురునే పెళ్లి చేసుకోబోతున్నాడట. 

అభిరామ్ వరసకి మేనత్త కూతురు.. మరదిలినే పెళ్లాడబోతున్నాడు. ప్రస్తుతం ఇరు కుటుంబాల వారు పెళ్లి మాటలు మట్లాడుకున్నప్పటికీ.. ఇంకా నిశ్చితార్ధం ముహుర్తం అలాగే పెళ్లి ముహుర్తం ఫిక్స్ చెయ్యాల్సి ఉందట. ఎట్టి పరిస్తితుల్లోనూ అభిరామ్ పెళ్లి ఈ ఏడాది లోనే ఉండబోతున్నట్లుగా సమాచారం. 

Daggubati family wedding bells are ringing:

Daggubati Abhiram Marriage On Cards
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs