Advertisement
Google Ads BL

పవన్ పాలిటిక్స్ పై మంచు విష్ణు కామెంట్స్


పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పై మంచు హీరో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రస్తుత మా అధ్యక్షుడు మంచు విష్ణు.. జిన్నా మూవీ సక్సెస్ తర్వాత లాంగ్ బ్రేక్ తో భక్త కన్నప్ప  అనూ భారీ ప్రాజెక్ట్ చెయ్యబోతున్నారు. దానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్కులో బిజీగా వున్న విష్ణు తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఫ్యామిలీ గొడవలతో పాటుగా.. రాజకీయాలపై కామెంట్స్ చేసారు. ఆ ఇంటర్వ్యూలో సదరు యాంకర్ ఏపీలో పవన్ కళ్యాణ్ రాజకీయాలపై స్పందించమని మంచు విష్ణుని అడిగారు. 

Advertisement
CJ Advs

దానితో విష్ణు పవన్ కళ్యాణ్ రాజకీయాలపై మాట్లాడడానికి నేనేమన్నా బ్రహ్మం గారినా.. పవన్ సినిమాల గురించి అడిగితే చెప్పగలను. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆయన సూపర్ స్టార్. అందులో ఎలాంటి సందేహం లేదు. పవన్ నటించిన ఒక సినిమా ప్లాప్ అయినా.. మరో సినిమాతో మంచి కలెక్షన్స్ వస్తాయి.. ఇలా సినిమాల గురించి మాట్లాడమంటే మట్లాడుతాను కానీ ఆయన రాజకీయాలపై నేనేమి మాట్లాడలేను అని చెప్పాడు. 

సినిమాలైతే చూస్తారు కానీ.. పాలిటిక్స్ లో ఓటెయ్యాలంటే ఓటేయ్యరు. ప్రజలు చాలా స్మార్ట్ గా తయారయ్యారు. తమకి నచ్చిన వ్యక్తులనే ఎంచుకుని ఓట్లేస్తారు అంటూ మంచు విష్ణు రాజకీయాలపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Manchu Vishnu comments on Pawan politics:

Manchu Vishnu comments on Pawan Kalyan politics
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs