Advertisement
Google Ads BL

మనశ్శాంతి కావాలంటే తిట్టండి: రేణు దేశాయ్


పవన్ కళ్యాణ్ పెళ్లి తర్వాత విడాకుల విషయంలో రేణు దేశాయ్ ని పవన్ ఫాన్స్ బాగా టార్గెట్ చేసారు. ఆమె భర్తకి దూరంగా విడాకులు తీసుకుని తన బ్రతుకు తాను బ్రతుకుతున్నా పవన్ ఫాన్స్ మాత్రం ఆమెని వదిలేవారు కాదు.. రేణు దేశాయ్ కూడా గట్టిగానే కౌంటర్లు వేసినా పవన్ ఫాన్స్ ట్రోల్స్ ఆగేవి కావు. అయితే తాజాగా రేణు దేశాయ్ మాజీ భర్త పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదు, ఆయన వ్యక్తిత్వం మంచిది, నా విషయంలో పొరబాటు చేసారంటే ఒప్పుకుంటాను. 

Advertisement
CJ Advs

కానీ పవన్ కళ్యాణ్ చాలామంచి వ్యక్తి, అతను రాజకీయాల్లో ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నాడు, ఒక్క అవకాశం ఇవ్వమని ప్రజలని కోరింది. దానితో రేణు దేశాయ్ మాజీ భర్త పవన్ కళ్యాణ్ చెప్పడం వలనే ఇలా పాజిటివ్ గా మాట్లాడింది, పవన్ కళ్యాణ్ సన్నిహిత వ్యక్తులు రేణు దేశాయ్ కి డబ్బులిచ్చి ఇలా మాట్లాడించారంటూ సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ విషయమై రేణు దేశాయ్ స్పందించింది. 

ప్రేమలో పడినందకు, నిజాలు మాట్లాడినందకు తనకు దక్కింది ఇదేనని ఆవేదన వ్యక్తం చేసింది, నన్ను అన్నారు కదా.. మీకు మనశ్శాంతి దొరికిందా అంటూ ప్రశ్నించిన రేణూదేశాయ్ మనశ్శాంతి దొరక్కపోతే ఇంకా తిట్టమంటూ కామెంట్ చేసింది. 

నేను పవన్ కళ్యాణ్ తో విడిపోయి విడాకులు తీసుకున్నప్పుడు.. ఆయన నుండి భారీ మొత్తంలో భరణం తీసుకున్నాను అని ప్రచారం చేసారు. నేను అప్పట్లో పవన్ కళ్యాణ్ వలన మోసపోయాను అని చెప్పాను. అప్పుడు కూడా వేరే వాళ్ళు చెబితే అలా చేసానని పవన్ ఫాన్స్ వేధించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచోడు, చెడ్డ మనిషి కాదు.. డబ్బు మనిషి కాదు అని చెబితే ఆయన రాజకీయ రైవల్స్ పవన్ సన్నిహితుల దగ్గర డబ్బులు తీసుకుని చెప్పాను అంటున్నారు. నేను అప్పుడు చెప్పింది నిజమే, ఇప్పుడు చెప్పింది నిజమే అంటూ 

పవన్ అందుకే మిమ్మల్ని తరిమేశాడా అంటూ ఒక నెటిజన్ పెట్టిన కామెంట్  కి గట్టిగానే రిప్లై ఇచ్చింది. 

Curse if you want peace of mind: Renu Desai:

Pawan Kalyan ex-wife Renu Desai hits back at troll
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs