సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ళ తర్వాత జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కిన జైలర్ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో హల్ చల్ చేస్తుంది. ప్యాన్ ఇండియా ఫిలిం గా విడుదలైన జైలర్ కి అన్ని భాషల్లో యునానమస్ గా పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీసుని కుళ్ళబొడుస్తుంది. ఆరు రోజుల్లోనే జైలర్ ఈజీగా 400 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టి ఔరా అనిపించింది.
జైలర్ గా రజినీకాంత్ లుక్స్ కి, ఆయన స్టయిల్ కి ఫిదా కానీ వారు లేరు. మరోపక్క శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రఫ్ గెస్ట్ రోల్స్ అన్నీ ఆయా భాషల ఆడియన్స్ ని జైలర్ కనెక్ట్ అయ్యేలా చెయ్యడంలో కీలక పాత్ర పోషించాయి. యోగి బాబు కామెడీ, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్.. ముఖ్యంగా అనిరుధ్ BGM అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఒకటే BGM ఇచ్చినా.. అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యింది. దానితో జైలర్ హిట్ లిస్ట్ లోకి వెళ్ళింది.
ఇక ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రజినీకాంత్ జైలర్ 400 కోట్లు కొల్లగొట్టడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రజినీకాంత్ కి ఈ రేంజ్ హిట్ అనేది రోబో తర్వాత మళ్ళీ రాలేదు. రోబో 2., పేట, కాలా, కబాలి, అన్నత్థే ఇలా ప్రతి సినిమా ఆయన్ని, ఆయన అభిమానులు చాలా నిరాశ పరిచాయి. ఇక ఇప్పుడు జైలర్.. కమల్ హాసన్ విక్రమ్ కలెక్షన్స్ ని దాటెయ్యడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. కేవలం ఆరు రోజుల్లోనే జైలర్ 400 కోట్ల టార్గెట్ ని రీచ్ అయ్యి సూపర్ స్టార్ రజినీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది.