హీరోలు నెగెటివ్ పాత్రలు చేసేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. ఒకప్పుడు హీరోలు ఎలాంటి పాత్ర చెయ్యడానికైనా రెడీగా ఉండేవారు. కానీ ఈమధ్య కాలంలో అవి చాలా అరుదుగా కనబడుతున్నాయి. సుల్తాన్ లో బాలకృష్ణ, జై లవ కుశ లో ఎన్టీఆర్, v సినిమాలో నాని.. ఇలా ఎక్కడో కానీ హీరోలు నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్స్ లో కనిపించే సాహసం చెయ్యడం లేదు.
తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ విలన్ కేరెక్టర్ చేయబోతున్నాడట. జై భీమ్ దర్శకుడు సూపర్ స్టార్ రజినీకాంత్-మెగాస్టార్ అమితాబ్ తో తెరకెక్కించబోయే సినిమాలో శర్వానంద్ నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తాడని టాక్. అసలైతే ఈ కేరెక్టర్ కోసం ముందుగా హీరో నాని ని సంప్రదించగా.. నాని నో చెప్పడంతో.. ఆ ఛాన్స్ శర్వానంద్ ని వరించింది అని తెలుస్తోంది.
ప్రస్తుతం శర్వానంద్ పెళ్లి తర్వాత సైలెంట్ గా సినిమా చేసుకుంటున్నాడు. శర్వా కొత్త సినిమా అప్ డేట్ కోసం ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు.