Advertisement
Google Ads BL

మెగాస్టార్-కళ్యాణ్ కృష్ణ మూవీకి బ్రేక్?


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోకాలికి ఆపరేషాన్ చేయించుకుని ఆసుపత్రిలో ఉన్నారు. చిరు మోకాలి ఆపరేషన్ పై అధికారిక న్యూస్ లేకపోయినా.. ఆయన ఢిల్లీలోని ఆర్దోపెడిక్ నీ వాష్ చేయించుకున్నారని తెలుస్తుంది. అదలాఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ రిజల్ట్ తో బాగా డిస్పాయింట్ అయ్యారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా మెగా ఫాన్స్ కూడా మెగాస్టార్ ని విమర్శించడం మరింత ఇబ్బందిగా మారింది. భోళా శంకర్ రీమేక్ చేయొద్దు అని మెగా ఫాన్స్ మొత్తుకున్నారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి బంగార్రాజు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో బ్రో డాడీ రీమేక్ చేస్తారనే అనే న్యూస్ నడుస్తుంది. రీమేక్స్ చేస్తే తప్పేమిటి అన్న చిరు కి భోళా శంకర్ గుణపాఠం నేర్పింది. అయినా మళ్ళీ ఆయన రీమేక్ చేస్తే మెగా ఫాన్స్ అస్సలు ఒప్పుకోరు. కళ్యాణ్ కృష్ణ బ్రో డాడీ రీమేక్ కోసం కథ సిద్ధం చేసి హీరోయిన్ గా త్రిషని, మరో హీరోగా శర్వా ని ఎంపిక చేసి ఒప్పించారనే న్యూస్ కూడా ఉంది. అది ఆగష్టు 22న పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది అనే ప్రచారం ఉంది. 

ఇప్పుడు మెగాస్టార్ భోళా రిజల్ట్ నేపథ్యంలో కళ్యాణ్ కృష్ణ తో మూవీ మొదలు పెట్టాలా, కాస్త గ్యాప్ ఇవ్వాలా, ఎలాగూ ఆపరేషన్ తో ఓ రెండు నెలలు సెట్స్ మీదకి వెళ్లలేము.. ఆ తర్వాతే కళ్యాణ్ కృష్ణ మూవీని మొదలు పెడితే ఎలా ఉంటుంది, అసలు చేద్దామా.. వద్దా అనే ఆలోచనలో ఉన్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Break for Megastar-Kalyan Krishna movie?:

Megastar Chiranjeevi in plans to take a major break from Kalyan Krishna movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs